నితిన్ ఆధ్వర్యంలో సునీత-రామ్ వీరపనేని ప్రీ-వెడ్డింగ్ సెలెబ్రేషన్స్!

singer sunitha pre wedding event pics

సింగర్ సునీత మొదటి భర్తతో విడాకుల తర్వాతా చాలా కాలం ఒంటరిగానే ఉంది , ఇటీవలనే తన రెండో వివాహానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసింది.ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో త్వరలోనే తాను రెండో వివాహం చేసుకోబోతున్నట్లు తెలియజేసింది.ఇక అప్పటి నుండి ఈ పెళ్లి గురించి రకరకాలుగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతుంది . రీసెంట్ గా ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వచ్చిన సునీత మీడియాతో మాట్లాడుతూ… పెళ్లి గురించి ఇష్టం వచ్చినట్లు రాయొద్దని , ఏదైనా ఉంటె నేనే మీకు చెప్తానని చెప్పింది.

singer sunitha pre wedding event pics
singer sunitha pre wedding event pics

రెండు రోజుల నుండి సోషల్ మీడియా లో సునీతకి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ హీరో నితిన్ తాజాగా ఈ కాబోయే దంపతులకు ఓ అదిరిపోయే పార్టీ ఇచ్చాడట. రామ్ వీరపనేనికి మంచి సన్నిహితుడైన హీరో నితిన్, హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్‌లో వారికి అదిరిపోయే విందునిచ్చాడట.త్వరలో పెళ్లి చేసుకోబోతున్న కారణంగా నితిన్ సునీత-రామ్‌లకు ఈ ట్రీట్ ఇచ్చాడు.కాగా ఈ పార్టీకి టాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు సైతం హాజరైనట్లు తెలుస్తోంది.

singer sunitha pre wedding event pics
singer sunitha pre wedding event pics

వారిలో యాంకర్ సుమ, రేణు దేశాయ్ , కొందరు గాయని గాయకులు , బంధువులు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.ఇక సునీత, రామ్ వీరపనేని త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కుతుండటంతో వారి జీవితం సంతోషంగా సాగిపోవాలని పలువురు ఈ సందర్భంగా ఆకాక్షించారు.మరి ఈ దంపతులు ఎప్పుడు, ఎక్కడ పెళ్లి చేసుకుంటున్నారనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

singer sunitha pre wedding event pics
singer sunitha pre wedding event pics