టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న సింగర్ సునీతకు అభిమానులు ఏ రేంజ్ లో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆమె ఇటీవల సెకండ్ మ్యారేజ్ కు సిద్దమవ్వడంతో ఒక్కసారిగా న్యూస్ వైరల్ అయ్యింది. నిశ్చితార్థం చేసుకున్న ఫొటోలు రిలీజ్ అయ్యేవరకు కూడా వార్తలను నిజమని ఎవరు నమ్మలేదు.
వేక్డ్ ఔట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రామ్ ను సునీత సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతున్నారు. ఇక వీరి మ్యారేజ్ గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీత మొదటిసారి తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వెళ్లిన సునీత అక్కడ పెళ్లి టాపిక్ రాగానే సెకండ్ మ్యారేజ్ పై సరికొత్త అర్దాన్ని వివరించింది.
‘ఇది నా వెడ్డింగ్ అని నేను చెప్పలేను. ఒక కుటుంబం మరొక కుటుంబంతో కలుస్తోందని చెప్పవచ్చు. రెండు కుటుంబాలు ఈ విధంగా కలవడం నిజంగా నాకొక డివైన్ గా అనిపిస్తోంది. అది ఎక్కువగా నచ్చింది..’ అంటూ వివరణ ఇచ్చారు సునీత. ఇక రామ్, సునీతల పెళ్లి జనవరిలో జరగనుందనే కామెంట్స్ చాలానే వచ్చాయి. ఇక ఆ విషయంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు జరగవచ్చని సమాధానం ఇచ్చారు సునీత.