సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ ఎప్పుడు ఏ అవకాశం వస్తుందో చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా హీరోయిన్స్ కి ఎప్పుడు అవకాశం వస్తుందో , ఎప్పుడు రాదో చెప్పలేము. కొందరికి తోలి సినిమా విడుదల కాకమునుపే భారీగా ఆఫర్లు వస్తాయి. మరికొందరు ఒక్క సినిమాతోనే సరిపెట్టుకుంటుంటారు. ఇదిలా ఉంటే . సిమ్రన్ కౌర్ విషయంలో కూడా అదే జరిగింది. మంచు మనోజ్ హీరోగా నటించిన ‘పోటుగాడు’ సినిమా ద్వారా ఈ చిన్నది అప్పట్లో టాలీవుడ్ కి పరిచయం అయింది.
అయితే, ఆ సినిమా ఆమెకు పెద్దగా ఉపయోగపడలేదు. అందుకే ఆ వెంటనే టాలీవుడ్ నుంచి ఆఫర్లు రాలేదు. ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత సిమ్రన్ కు మళ్లీ తెలుగు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అది కూడా ప్రభాస్ సినిమా కావడం విశేషం. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘రాధే శ్యామ్’ పేరిట ఓ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ రూపొందుతున్న సంగతి విదితమే. పూజ హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ చిత్రంలో సిమ్రన్ కౌర్ ఓ ముఖ్య పాత్ర పోషించింది. దీని గురించి ‘ఈ చిన్నది చెబుతూ, ఆమధ్య ‘రాధేశ్యామ్’ టీమ్ నుంచి కాల్ వచ్చింది. ఓ క్యారెక్టర్ వుంది చేస్తారా? అని అడిగారు. వెంటనే ఒప్పేసుకున్నాను. ఇందులో నాది కీలమైన మంచి పాత్ర, ఇందులో నటించినందుకు హ్యాపీగా వుంది’ అని చెప్పింది.
ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధే శ్యామ్‌లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. కృష్ణం రాజు భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, మురళీశర్మ, శాషా ఛత్రీ, కునాల్ రాయ్ కపూర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ 70శాతానికి పైగా పూర్తి అయ్యింది. కాగా మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించిన సిమ్రాన్.. 2008లో మిస్ ఇండియా యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్నారు. ఈ బ్యూటీ హిందీలో జో హుమ్ చాహేన్ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులోనూ మంచు మనోజ్ నటించిన పోటుగాడు చిత్రంలో సిమ్రాన్ నటించింది. ఇప్పుడు ఎనిమిదేళ్ల తరువాత ఆమె తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది.