ప్రభాస్ ఫ్యాన్స్.. ఏంటయ్యా మాకు ఈ టార్చర్ అంటూ బాధపడుతున్నారు..?

ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ గా ఎలాంటి సినిమాలను చేస్తున్నాడో అందరికీ తెలిసిందే. బాహుబలి సినిమాలతో నేషనల్ స్టార్ గా మారిన ప్రభాస్.. ఆ తర్వాత నుంచి ప్రతీ సినిమా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కుతుండటం విశేషం. ఇప్పుడు ప్రభాస్ వరసగా నాలుగు ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు లైన్ లో పెట్టాడు. సాహో సినిమా కి నెగిటివ్ రిజల్ట్ వచ్చినా కూడా ఆ ప్రభావం కాస్త కూడా ప్రభాస్ మార్కెట్ మీద పడలేదు సరికదా.. ఇంకా నాలుగు రెట్లు పెరిగింది. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ రిలీజ్ కు రెడీ అవుతోంది.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. రాధకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. గోపీకృష్ణ మూవీస్ – యూవీ క్రియేషన్స్ కలిసి 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ప్రభాస్ చెల్లి ప్రశీద నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతోంది. కాగా రీసెంట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ సినిమా మీద భారీగా అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అన్న సినిమాని సెట్స్ మీదకి తీసుకు వచ్చాడు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అవగా ఈ నెల 22 నుంచి సెకండ్ షెడ్యూల్ ప్రారంభం అవబోతోంది.

ఇక బాలీవుడ్ స్ట్రైట్ సినిమా ఆదిపురుష్ కూడా సెట్స్ మీదకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ‘రాధేశ్యామ్’ తర్వాత మొదలవ్వాల్సిన నాగ్ అశ్విన్ సినిమా మాత్రం ఎపుడు మొదలవుతుందో క్లారిటీ లేదు. అంతేకాదు మేకర్స్ కూడా ఎలాంటి అప్‌డేట్స్ కూడా ఇవ్వడం లేదు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అప్‌డేట్స్ ఇవ్వమని కోరుతున్నారు. అయితే దర్శకుడు నాగ్ అశ్విన్ మాత్రం ఇప్పుడే ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి న్యూస్ కరెక్ట్ కాదని అంటున్నాడు. ఇంకా షూటింగ్ మొదలవని సినిమా గురించి ఇప్పుడే ఎదో ఒకటి మాట్లేయడం కరెక్ట్ కాదని అందుకే అప్‌డేట్స్ ఇవ్వడం లేదని తెలిపాడు.