క్రియోటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమాతో క్రేజీ హీరోగా పాపులారిటీని సంపాదిచుకున్న సిద్దార్థ్ ఆ తర్వాత బాలీవుడ్ లో నటించిన రంగ్ దే బసంతి సినిమాతోనూ ఆ పాపులారిటీని రెట్టింపు చేసుకున్నాడు. ఈ సినిమా లో సిద్దార్థ్ పర్ఫార్మెన్స్ చూసిన టాలీవుడ్ మేకర్ ఎం.ఎస్.రాజు.. ఆయన నిర్మాణంలో వచ్చిన ‘నువ్వొస్తానంటే నేనోద్దంటానా’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం చేశాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో టాలీవుడ్ లో ఈ హీరోకి విపరీతమైన పాపులారిటీ, క్రేజ్ పెరిగిపోయాయి.
ఇక దిల్ రాజు నిర్మాత రూపొందిన బొమ్మరిల్లు సినిమా సిద్దార్థ్ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. ఆ తర్వాత ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ ‘ఓయ్’ సినిమాలు చేసిన ఈ హీరోకి ఒక్కసారిగా టాలీవుడ్ లో ఫ్లాప్స్ ఎదురయ్యాయి. దాంతో హీరోగా తెలుగు సినిమాలలో కనిపించలేకపోయాడు. చూస్తు చూస్తూ 8 ఏళ్ళ గ్యాప్ వచ్చింది. ఈ 8 ఏళ్ళలో సిద్దార్థ్ తమిళ సినిమా ఇండస్ట్రీలో అడపా దడపా సినిమాలు చేస్తూ ఉన్నాడు. అంతేకాదు నిర్మాతగాను మారాడు.
కాగా ఇటీవలే సిద్దార్థ్ కి టాలీవుడ్ లో మంచి అవకాశం వచ్చింది. కాని అది సెకడ్ హీరోగా. అంతేకాదు ఈ క్యారెక్టర్ విలన్ తరహాలో ఉంటుందని సమాచారం. ‘ఆర్ ఎక్స్ 100’ ఫేం అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ‘మహా సముద్రం’ సినిమాలో సిద్దార్థ్ నటిస్తున్నాడు. ఈ సినిమా మల్టీస్టారర్ గా రూపొందనుండగా శర్వానంద్ హీరోగా నటించనున్నాడు. అదితి రావు హైదరి , అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించనున్నారు.
కాగా దాదాపు 8 ఏళ్ళ తర్వాత మళ్ళీ తెలుగు సినిమా ‘మహా సముద్రం’లో నటిస్తుండటం తో బాగానే ఆశలు పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమా వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో క్రైమ్ థ్రిల్లర్ గా తెలుగు, తమిళ భాషలో ఒకేసారి తెరకెక్కనుంది. అయితే సోలో హీరోగా భారీ సక్సస్ లు అందుకున్న సిద్దార్థ్ కి చాలా లాంగ్ గ్యాప్ తర్వాత చేస్తున్న ‘మహా సముద్రం’ తో సక్సస్ అందుకుంటాడా చూడాలి.