‘బొమ్మరిల్లు’ సిద్దార్ధ గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఓవరాక్షన్‌కి కేరాఫ్ అడ్రస్. సినిమాల్లో బాగానే నటిస్తాడు. మంచి నటుడు కూడా.! అసలు సమస్య, రియల్ లైఫ్‌లో నటించడమే. పైగా, ఆ నటన కూడా అతి.!
తన తాజా చిత్రం ప్రమోషన్ కోసం హైద్రాబాద్ వచ్చాడు సిద్దార్ధ. వస్తూనే, పబ్లిసిటీ బాగా డిజైన్ చేసుకున్నాడు. సినిమా ఎర్నలిస్టులతో.. (ఔను, ఎర్నలిస్టులే.. జర్నలిస్టులు కారు వాళ్ళు) ప్లాన్ చేసుకుని మరీ, డ్రమెటిక్‌గా క్లాస్ తీసేసుకున్నాడు.
ఆ ఎర్నలిస్టులకి కూడా, చిత్ర నిర్మాతలు ఇచ్చే పేమెంట్లకు తగ్గట్టు నటించేస్తున్నారు, ఈ క్రమంలో చీవాట్లు తినడానికీ మొహమాటపడ్డంలేదు. దాదాపు ఓ పది మంది వరకు ఇలాంటోళ్ళున్నారు. అందులో ఓ నలుగురైదుగురు మరీ యాక్టివ్.
ఇక్కడ, తరచూ చీవాట్లు తింటోన్న ఎర్నలిస్టుకి, సిద్దార్ధ తిట్లతో బాగానే జేబులు నిండాయని అంటున్నారు. మామూలుగా వచ్చేయదు కదా సినిమాకి ప్రమోషన్.! కొసమెరుపేంటంటే, హీరో సిద్దార్ధ స్వయంగా ఈ పెయిడ్ ఎపిసోడ్‌కి దర్శకత్వం వహించాడట.
లకారాల్లోనే చెల్లింపులు జరిగాయన్న విషయం బయటకు పొక్కేసరికి, అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదన్నమాట, ఆ సిద్దార్ధ అతి, అలాగే ఆ ఎర్నలిస్టు పైత్యం వెనుక కారణం.! డబ్బెవరికి చేదు.?