శ్యామల గారు మీరు హీరోయిన్ గా ఎందుకు ట్రై చెయ్యలేదు..?

సీరియల్ ఆర్టిస్ట్ గా, టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఎన్నో టీవీ సీరియల్స్, అలాగే ఎన్నో సినిమాలలోను నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి శ్యామల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో సీరియల్ ఆర్టిస్ట్ గా పలు టీవీ సీరియల్స్ లో నటించారు. అయితే ప్రస్తుతం ఈమె సీరియల్స్లో నటించకపోయినప్పటికీ బుల్లితెర యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.బుల్లితెర యాంకర్ సుమ తర్వాత అలాంటి క్రేజ్ సంపాదించుకున్న వారిలో శ్యామల ఒకరు.

ప్రస్తుతం ఈమె బుల్లితెర యాంకర్ గా కొనసాగుతూ మరోవైపు యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన ఎన్నో విశేషాలను యూట్యూబ్ ద్వారా అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె ఇన్స్టాగ్రామ్ రీల్ ద్వారా ఒక డాన్స్ వీడియోని షేర్ చేశారు. హీరోయిన్ కి ఏ మాత్రం తీసుకొని అందం టాలెంట్ ఉన్నటువంటి శ్యామల చేసినటువంటి ఈ డాన్స్ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే ఈ రీల్ చూసిన ఎంతో మంది నెటిజన్లు ఈ వీడియో పై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ శ్యామల రీల్ వీడియో పై స్పందించి హీరోయిన్ గా ట్రై చేయలేదు ఎందుకండి అంటూ కామెంట్ చేశారు. ఇలా ఈమె గురించి చేసిన ఈ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక శ్యామల బుల్లితెర నటుడు నరసింహారెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈమె బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ గా వెళ్లి తన అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ తో మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు.