Shubman Gill: ప్రేమ విషయంలో ఊహాగానాలకు బ్రేక్.. క్లారిటీ ఇచ్చిన గిల్

Shubman Gill: భారత క్రికెట్ యువ సంచలనం శుభ్‌మన్ గిల్ తన వ్యక్తిగత జీవితం గురించి చివరకు క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన గిల్, తన రిలేషన్‌షిప్ స్టేటస్‌పై వస్తున్న పుకార్లకు ముగింపు పలికాడు. గత మూడేళ్లుగా సింగిల్‌గానే ఉన్నానని, ప్రస్తుతం పూర్తిగా కెరీర్‌పైనే దృష్టి సారించానని స్పష్టం చేశాడు. సోషల్ మీడియాలో తన పేరు అనేక గాసిప్స్‌కు కారణమవుతున్నప్పటికీ, అవన్నీ అబద్ధాలేనని గిల్ తెలిపారు.

ప్రస్తుతం ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా రాణిస్తున్న గిల్, తన మైదానంలో నిబద్ధతతోనే కాదు, మైదానం బయట కూడా మంచి ప్రొఫెషనలిజంతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తనపై వస్తున్న వదంతుల గురించి మాట్లాడుతూ, “నేను కలవని వ్యక్తులతో కూడా సంబంధం ఉందంటూ వార్తలు వస్తుండటం చాలా విచిత్రంగా ఉంటుంది” అని హాస్యంగా చెప్పారు. ప్రస్తుతం తనకు ప్రేమ వ్యవహారాలకు, రిలేషన్‌షిప్‌లకు సమయం లేదని స్పష్టం చేశారు.

గిల్ తన ప్రస్తుత జీవనశైలిని వివరిస్తూ, “సంవత్సరంలో సుమారు 300 రోజులు టూర్లలో ఉండటంతో, ఎవరితోనైనా రిలేషన్‌షిప్ కొనసాగించడం సాధ్యం కాదు” అని చెప్పారు. ప్రస్తుత ఫేజ్‌లో తనకు కెరీర్ మాత్రమే ప్రాధాన్యం అని, వ్యక్తిగత జీవితానికి స్పేస్ లేదని తెలిపారు. ప్రొఫెషనల్ గోల్స్‌నే ఫోకస్‌గా పెట్టుకున్నానని గిల్ స్పష్టం చేశారు.

తాను మైదానంలో అడుగు పెట్టిన తర్వాత ఎలా మైండ్‌సెట్‌లో ఉంటాడో కూడా గిల్ వివరించారు. “ఒకసారి మ్యాచ్‌లో దిగాక, నా పూర్తి ఏకాగ్రత ఆటపైనే ఉంటుంది. ప్రేక్షకుల అరుపులు, బయటి ప్రపంచం ఏమైపోయిందో కూడా గుర్తుండదు” అని చెప్పారు. తన ముందున్న లక్ష్యంపై మాత్రమే దృష్టి సారించి, ఆటను ఆస్వాదించటం తన అలవాటు అని చెప్పారు. మొత్తానికి, శుభ్‌మన్ గిల్ తనపై వస్తున్న పుకార్లకు తానేం లిప్తుడి కాదని క్లియర్‌గా చెప్పాడు. కెరీర్‌పై పూర్తి దృష్టితో, భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు.

కీరవాణి పెద్ద కాట్రాజ్ || Director Geetha Krishna About Singer Sunitha & Keeravani || Telugu Rajyam