పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన శృతిహాసన్.. పెళ్ళంటేనే ఆందోళన అంటున్న శృతి!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగుతున్న కమల్ హాసన్ వారసురాలిగా శృతి హాసన్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కెరియర్ మొదట్లో ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకున్నప్పటికీ అనంతరం అద్భుతమైన సినిమాలతో ఇండస్ట్రీలో దూసుకుపోయారు. ఇలా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో ఈమె లండన్ కి చెందిన మైఖేల్ కోర్స్లే తో పీకల్లోతు ప్రేమలో మునిగి పోయారు. ఏకంగా తన కోసం తన కెరీర్ నే శృతి హాసన్ వదులుకున్నారు. ఇక వీరిద్దరూ కలిసి దేశవిదేశాల్లో చెట్టాపట్టాలేసుకుని తిరగడమే కాకుండా వీరిద్దరూ పెళ్లికి పెద్దల అంగీకారం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.

శృతి హాసన్ తన ప్రియుడితో పలు మనస్పర్థల కారణం వల్ల తనతో బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ విధంగా లవ్ బ్రేకప్ కావడంతో శృతిహాసన్ పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. కొన్ని రోజుల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి శృతిహాసన్ తిరిగి ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శంతను హజారికా ప్రేమలో పడింది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఒకే అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు.ఇలా ప్రేమలో ఎంతో స్వేచ్చగా హాయిగా విహరిస్తున్న శృతిహాసన్ పెళ్లి విషయానికి వచ్చేసరికి తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఈ క్రమంలోనే పెళ్లి గురించి మాట్లాడుతూ ప్రేమలో ఉండటం హ్యాపీగానే ఉంది పెళ్ళంటే చాలా ఆందోళనగా ఉందని ఈమె చెప్పుకొచ్చారు.ఇలా పెళ్లి గురించి శృతిహాసన్ ఆందోళన చెందడానికి గల కారణం తన తల్లిదండ్రులు విడిపోవడమేనా అని ఆరా తీయగా,తన తల్లిదండ్రులు కలిసి ఉన్నన్ని రోజులు చాలా సంతోషంగా ఉన్నారని అయితే అది కారణం కాదని ఈమె వెల్లడించారు.ఇలా ఇద్దరూ కలిసి ఉన్నప్పటికీ పెళ్లి అనేది ఒక అధికారిక ప్రకటన అయినప్పటికీ తాను పెళ్లి గురించి ఎందుకు ఆందోళన చెందుతున్నారు అనే విషయం గురించి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కొందరు పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోవాలంటే విడాకులు తీసుకోవడానికి ఎంతో చట్ట బద్ధత కావాలి. కానీ ప్రేమలో ఉంటే బ్రేకప్ చెప్పుకోవడం చాలా సులువు కనుక ఈమెకు ప్రేమంటేనే హ్యాపీగా ఉందని శృతిహాసన్ వెల్లడించినట్లు తెలుస్తోంది.