విశ్వనటుడు కమల్‌హాసన్ నట వారసురాలిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతిహాసన్ అతికొద్దికాలంలోనే హీరోయిన్‌గా మంచి క్రేజ్‌ను దక్కించుకుంది. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలతో నటించి ఒకానొక క్రమంలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే ఉన్నట్టుండి ఏమైందో తెలియదు కానీ వరుసగా ఆమెకు అవకాశాలు తగ్గిపోతున్నాయి.
మెల్లిమెల్లిగా సినీ అభిమానులు మర్చిపోతున్న తరుణంలో చిన్నా చితకా చిత్రాలు చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే తనకు సినిమా అవకాశాలు తగ్గిపోవడానికి గల కారణాలను తాజాగా శృతిహాసన్ వెల్లడించింది. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో చిటాచాట్ చేసిన ఈ ముద్దుగుమ్మ అనేక విషయాలను పంచుకుంది.
‘ప్రతీ రంగంలోనూ మంచి చెడు అనేవి రెండూ ఉంటాయి. అలాంటప్పుడు సినిమా ఇండస్ట్రీనే అందరూ వేలెత్తి చూపడం కరెక్ట్ కాదు. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలి నాళ్లలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడ్డాను. అయితే నా చిన్నతనం నుంచి మొహమాటం లేకుండా ఉన్నదిఉన్నట్లు చెప్పెయ్యడం అలవాటు. ఎదుటివారి ఎలాంటి వారైనా, వారి వయసులో ఎంత పెద్ద వారైనా,, వాళ్లు గతంలో చేసిన చిత్రాలతో సంబంధం లేకుండా నాకు క్యారెక్టర్ నచ్చకపోతే మొహం మీదే చెప్పేస్తా.
దీంతో ఎన్నో సినిమా అవకాశాలను పోగొట్టుకున్నా. అయితే ఏ రోజు కూడా అవకాశాలు రావడం లేదని ఏడూస్తూ కూర్చోలేదు. అయితే ఇలాంటి పరిస్థితులు ఎక్కడైనా ఉంటాయి. తమకు నచ్చినట్టుగా ఉండటం కారణంగా సర్వస్వం కోల్పోయిన వారిని చూశాను. అయితే ఎంత కష్టంలో ఉన్నా వ్యక్తిత్వాన్ని, స్వాభిమానాన్ని చంపుకొని బతకడం నాకు నచ్చదు’ అంటూ శృతిహాసన్ పేర్కొంది.