Shruthi Hassan: కోలీవుడ్ స్టార్ హీరో కూతురిగా శృతి హాసన్ అందరికీ సుపరిచితమే. కమల్ హాసన్ కుమార్తెగా అనగనగా ఒక ధీరుడు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె కెరీర్ మొదట్లో వరుస ఫ్లాపులు ఎదుర్కొంది. ఇలా వరుసగా ఈమె నటించిన సినిమాలు ఫ్లాప్ కావడంతో ఇండస్ట్రీలో ఈమెను ఐరన్ లెగ్ గా భావించారు. అయితే గబ్బర్ సింగ్ సినిమాతో తన పై ఉన్న ఈ ముద్ర చెరిపేసుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతోబిజీగా గడుపుతున్న శృతి హాసన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో కూడా సరదాగా ముచ్చటిస్తూ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంటారు.
ఈ క్రమంలోనే శృతిహాసన్ తరచూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ వారు ఎలాంటి ప్రశ్నలు వేసినా ఏమాత్రం విసుక్కోకుండా ఓపికగా సమాధానం చెబుతుంటారు. అయితే తాజాగా అభిమానులతో ముచ్చటించడం శృతిహాసన్ కు ఓ వింత ప్రశ్న ఎదురయింది.గతంలో శృతి హాసన్ తాను అందంగా కనిపించడం కోసం కొన్ని సర్జరీలో చేయించుకున్నట్లు వెల్లడించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మీరు మీ శరీరంలో ఏఏ పార్ట్ లకు సర్జరీ చేయించుకున్నారని ప్రశ్నించారు.
ఈ విధంగా నెటిజన్ ప్రశ్నించడంతో శృతిహాసన్ కాస్త అసహనం వ్యక్తం చేశారు.ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ ముందు నీ పని నువ్వు చూసుకో అంటూ గట్టిగా దానికి రిప్లై ఇచ్చారు.అనంతరం నువ్వు అడిగావు కనుక చెబుతున్నాను నేను నా శరీరంలో నా ముక్కుకు మాత్రమే సర్జరీ చేయించుకున్నాను అంటూ సమాధానం చెప్పారు. ఇక ప్రస్తుతం శృతిహాసన్ మెగాస్టార్ 154, బాలకృష్ణ 107, ప్రభాస్ సలార్ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.