చిన్నప్పటి శ్రుతీ హాసన్‌ను చూస్తే షాకవుతారు.. అంతా సర్జరీ మహిమ!!

లోక నాయకుడు, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ వారసురాలిగా శ్రుతీ హాసన్‌ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అయితే మామూలుగా శ్రుతీ హాసన్‌కు మ్యూజిక్ అంటే ఇష్టం. ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేసేది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వకముందు ఈనాడు సినిమాకు మ్యూజిక్ కూడా అందించింది. అయితే బాగానే క్లిక్ అయింది. అయితే ఆపై శ్రుతీ హాసన్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

Shruti Haasan Shares Childhood pics
Shruti Haasan Shares Childhood pics

మొదట్లో హీరోయిన్‌గా శ్రుతీ హాసన్‌ అంతగా క్లిక్ కాలేదు. మొదటి రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఐరెన్ లెగ్ అనే ముద్ర పడింది. కానీ గబ్బర్ సింగ్ చిత్రంతో శ్రుతీ హాసన్‌ తలరాతే మారిపోయింది. ఆ దెబ్బతో సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అంతటా ఫేమస్ అయిపోయింది. అయితే శ్రుతీ హాసన్‌ ఇంతలా క్రేజ్ తెచ్చుకోవడానికి కారణం ఆమె అందం. అయితే అది ఊరికే రాలేదు. ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవడంతో శ్రుతీ హాసన్‌ మొహంలో కళే మారిపోయింది.

Shruti Haasan Shares Childhood pics
Shruti Haasan Shares Childhood pics

శ్రుతీ హాసన్‌ గ్లామర్‌కు కుర్రాకారు అందరూ ఫిదా అయ్యారు. అయితే సర్జరీకి ముందు శ్రుతీ హాసన్‌ ఫోటోలు మరీ దారుణంగా ఉంటాయి. తాజాగా శ్రుతీ హాసన్‌ తన చిన్నప్పటి ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలో ఉన్నది శ్రుతీ హాసన్‌ అంటే అస్సలు నమ్మలేం. మనకు ఇప్పుడు చూస్తున్న శ్రుతీ హాసనే ఎక్కువగా గుర్తుంటుంది. కానీ స్కూల్ ఏజ్‌లో శ్రుతీ హాసన్‌‌ను ఇప్పటి శ్రుతీ హాసన్‌ను పోల్చి చూస్తే ఎంతో తేడా ఉంది. అంతా సర్జీరి మహిమ.