పెళ్లి పీటలెక్కనున్న శృతిహాసన్… తొందర్లోనే క్లారిటీ..?

కోలీవుడ్ స్టార్ హీరో కమలహాసన్ కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తండ్రి ఒక స్టార్ హీరో అయినా కూడా తన సొంత టాలెంట్ తో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ హీరోయిన్గా మంచి గుర్తింపు పొందింది. అనగనగా ఒక ధీరుడు సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతిహాసన్ ఓ మై ఫ్రెండ్, గబ్బర్ సింగ్, సెవెంత్ సెన్స్ శ్రీమంతుడు బలుపు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ఇక కొంతకాలం తన ప్రియుడి కోసం సినిమాలకు దూరమైన శృతిహాసన్ ఇటీవల రీఎంట్రీ ఇచ్చి వరుస హిట్ లతో దూసుకుపోతుంది.

 

తాజాగా శృతిహాసన్ నటించిన వాల్తేరు వీరయ్య వీర సింహారెడ్డి సినిమాలు సంక్రాంతి సందర్భంగా విడుదలై మంచి హిట్ అవ్వటంతో శృతిహాసన్ ఖాతాలో మరొక రెండు హిట్లు పడ్డాయి. అంతేకాకుండా ప్రభాస్ సరసన సలార్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉండగా శృతిహాసన్ వ్యక్తిగత జీవితం కూడా చాలా సంతోషంగా గడుపుతోంది. కెరీర్ ఆరంభంలో హీరో సిద్ధార్థ తో శృతిహాసన్ ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వినిపించాయి. ఆ తర్వాత కొంతకాలానికి లండన్ బేస్డ్ ఫోటో గ్రాఫర్ మైకేల్ కోర్సల్ తో ప్రేమలో కొంతకాలం సహజీవనం చేసింది. అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావటంతో అతనికి బ్రేకప్ చెప్పి దూరం అయింది.

 

ఇక ఆ తర్వాత డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో శృతిహాసన్ ప్రేమలో పడిన సంగతి అందరికీ తెలిసిందే. వీరి ప్రేమ గురించి శృతిహాసన్ స్వయంగా ప్రకటించింది. అంతేకాకుండా వీరిద్దరూ ముంబైలో సహజీవనం చేస్తున్నట్లు కూడా వెల్లడించింది. గత రెండేళ్లుగా ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తున్న శృతిహాసన్ ఎప్పటికప్పుడు తన వీడితో దిగిన ఫోటోలు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే ఇటీవల వీరిద్దరూ విడిపోయినట్లు వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై స్పందించిన శృతిహాసన్ వారి బంధం లో ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేసింది. ఇలా కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న శృతిహాసన్ తమ బంధం మరింత బలపరుచుకోవటానికి ప్రియులతో పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వీరి పెళ్లికి కమల్ హాసన్ కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం. తొందర్లోనే శృతిహాసన్ తన ప్రియుడిని పెళ్లి చేసుకోబోతోందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.