Shruthi Hassan: కరోనా టైంలోనూ శృతి మించి పోతున్న శ్రుతి హాసన్ చేష్టలు… !

Shruthi Hassan: స్టార్ కథానాయిక శృతి హాసన్ ఇటీవలే కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. త్వరలోనే కోలుకొని ప్రేక్షకులముందుకు వస్తానని కూడా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉంటూ, అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నానని తాజాగా ఒక ఫోటోను షేర్ చేసింది ఈ భామ. దీంతో తీవ్ర ఆందోళనలకు గురైన ఆమె అభిమానులు, ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని కామెంట్స్ కూడా చేశారు. ఇక ఆమె షేర్ చేసిన ఫోటోని గమనిస్తే వైరస్ ఇంపాక్ట్ ఆమెపై భారీగానే పడినట్లు కనిపిస్తోంది.

చిక్కి శల్యమైపోయి కనిపించిన ఆమెను చూసిన అందరూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నిజం చెప్పాలంటే టక్కున చూస్తే ఈమె శృతి హాసన్ అని గుర్తుపట్టలేనట్టుగా మారిపోయింది ఆమె ముఖం.
ఇక ఈ వార్త విన్న పలువురు సినీ ప్రముఖులు సైతం ఆమెకు త్వరగా నయం కావాలని ఆకాంక్షించారు. మరి కొంత మంది ఫోన్ చేసి, ఆమెను పరామర్శించారు.
కాగా ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్న శ్రుతి హాసన్.. తాజాగా ఆమె ఇన్స్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇందులో ఒకే బెడ్‌పై తన బాయ్‌ఫ్రెండ్ తో కలిసి ఉన్నారు. కరోనా ఉన్నా వీళ్లిద్దరూ కలిసే ఉంటున్నట్లు దీనిబట్టి అర్థం అవుతోంది. ఐతే ఈ సమయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకొని, అందరికీ దూరంగా దూరంగా ఉండాలని చెప్తున్నా… ఈ సమయంలో కూడా ఇలాంటి పనులెంటీ అని పలువురు విమర్శిస్తున్నారు.