Chiranjeevi, Shruti Hassan: టాలీవుడ్ ప్రేక్షకులకు యాక్టర్ శృతిహాసన్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. స్టార్ హీరో కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ భామ.. అనగనగా ఓ ధీరుడు సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది. ఆపై పలు స్టార్ హీరోల సరసన నటించి నటనలోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక తన అందం తో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇక శృతి బేబీ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ పోస్టులను తన ఇన్ స్టా ఖాతాలో పంచుకొని ఫ్యాన్స్ కు గ్లామర్ విందుని వడ్డిస్తుంది. ఇక సినిమాల కు రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ అమ్మడి క్రేజ్ ఎంతగా పెరిగిందో మనకు తెలుసు. దీనికొక ఉదాహరణ.. బాలయ్య సినిమాకు ఈ అమ్మడి ఏకంగా కోటిన్నర డిమాండ్ చేసిందట.
ఇక ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ను చూసి మూవీ మేకర్స్ ఏ మాత్రం ఆలోచించకుండా గోపీచంద్ మలినేని బాలయ్య కాంబోలో వస్తున్న ఎన్.బి.కె 107 సినిమాకు రెమ్యూనేషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి సీనియర్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.
చిరంజీవి పక్కన నటించడానికి శృతిహాసన్ చేసిన డిమాండ్ ఇంతనా..
ఇక తాజాగా చిరంజీవి సినిమాకు శృతిహాసన్ రెండు కోట్లు డిమాండ్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మూవీ మేకర్స్ సైతం శృతిహాసన్ డిమాండ్ యాక్సెప్ట్ చేసి అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సీనియర్ హీరోల సరసన శృతి వరుస ఆఫర్లు సంపాదించుకోవడం వలన ఈ అమ్మడి రెమ్యునేషన్ ఆకాశాన్నంటింది.
ఇక శృతి హాసన్ రాబోయే సినిమాల విషయానికొస్తే సలార్ అనే మూవీలో ప్రభాస్ సరసన నటిస్తున్న సంగతి మనకు తెలుసు. కాగా ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.