Shruthi Hasan : జర్నలిస్ట్ గా శృతి… ఇంతకీ ఏ సినిమాలోనో తెలుసా..?

 

Sruthi Hasan: ఇటీవల భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాధేశ్యామ్ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. విడుదలైన రోజు నుంచి రాధేశ్యామ్ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ప్రభాస్ అభిమానుల అందరి చూపు ప్రభాస్ తదుపరి చిత్రం అయినా సలార్ వైపే ఉంది.

సలార్ సినిమాని కే జి ఎఫ్ సినిమా తో సంచలనాన్ని క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాని యాక్టర్ పొలిటికల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ సినిమాలో శృతి హాసన్ పాత్ర గురించి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో శృతిహాసన్ ఒక జర్నలిస్టు పాత్రలో కనిపిస్తుందట. హీరో జీవితం గురించి తెలుసుకునే క్రమంలో అతనితో ప్రేమలో పడి, అతనితో పాటు క్రైమ్స్ చేస్తూ ఉంటుందట. ఈ సినిమాలోని శృతిహాసన్ పాత్ర ఆమె నటించిన పాత్రలకు విభిన్నంగా ఉంటుందని చెప్తున్నారు. ఈ సినిమాలో శృతి హసన్ నటించిన పాత్ర తన కెరీర్ లోనే ఉత్తమపాత్రలో ఒకటిగా నిలిచిపోతుందని అభిమానులు ఆశిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో శృతిహాసన్ యాక్షన్ సీన్లలో కూడా నడుస్తోందని సమాచారం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ప్రభాస్ ‘సలార్’ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.రాధేశ్యామ్ సినిమా తర్వాత వస్తున్న ఈ సినిమా అభిమానులు ఎలా అలరిస్తుందో చూడాలి.