Shruthi Hasaan: కమల్ హాసన్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నటి శ్రుతి హాసన్, కెరీర్ ప్రారంభించిన తొలి నాల్లలో అపజయాల లిస్ట్ లో చేరిపోయింది. దాంతో ఐరన్ లెగ్ అనే నెగటివ్ కామెంట్స్ కూడా భరిస్తూ వచ్చింది శ్రుతి హాసన్. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే ఆ కామెంట్స్ కు చెక్ పెడుతూ, తన విజయంతో అందరికీ సమాధానం చెప్పింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో తన హవాను కొనసాగించి, బలుపు, ఎవడు, రేసుగుర్రం లాంటి భారీ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఇకపోతే సినిమాల్లోనే కాదు, ఈ బ్యూటీ రియల్ లైఫ్ లోనూ అందరూ చెప్పుకునే విధమైన పలు పనులు చేస్తూ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అప్పట్లో ఓ ఫారిన్ వ్యక్తితో ప్రేమాయణం సాగించిన ఈ భామ, అతన్ని తన తల్లదండ్రులకు కూడా పరిచయం చేసింది. వీరిద్దరి పెళ్లి దాదాపు ఖాయం అనుకున్న తరుణంలోనే అతనితో బ్రేకప్ అయింది.
ఇక ఆ తర్వాత కొంతకాలం పాటు సింగిల్ లైఫ్ ను కొనసాగించిన శ్రుతి, ప్రస్తుతం శాంత హజారిక అనే ఫొటో గ్రాఫర్ తో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె, తన బాయ్ ఫ్రెండ్ పుట్టిన రోజు సందర్భంగా చేసిన రచ్చ ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. తన అందాలు ఆరబోస్తూ ట్రెండింగ్ డ్రెస్ లో కనిపించిన ఈ తార, అతనికి లిప్ లాక్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్య పరిచింది. అంతే కాకుండా తాజాగా శాంతనుతో కలిసి జిమ్ లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ వీడియో చూసిన పలువురు పలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.