మేకప్ రూంలో స్టార్ హీరోయిన్‌తో డైరెక్టర్.. వీడియో వైరల్

సౌత్స్ స్టార్ శ్రుతీ హాసన్ ప్రస్తుతం తెలుగులో ఒకే ఒక్క చిత్రం చేస్తోంది. అది కూడా బలుపు చిత్రంతో అదిరిపోయే హిట్ ఇచ్చిన కాంబోతో. దర్శకుడు గోపీచంద్ మలినేని, హీరో రవితేజ కాంబోలో వస్తోన్న క్రాక్ చిత్రంతో మళ్లీ చాలా గ్యాప్ తరువాత శ్రుతీ హాసన్ తెలుగు తెరపై కనిపించబోతోంది. ఆ మధ్య సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన శ్రుతీ హాసన్ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది

 

అలాంటి శ్రుతీ హాసన్ బ్రేకప్ తరువాత మళ్లీ కెరీర్‌పై దృష్టి పెట్టింది. కానీ అంత త్వరగా అవకాశాలు రాలేదు. లాభం చిత్రంతో తమిళంలో మళ్లీ కమ్ బ్యాక్ ఇవ్వబోతోంది. తెలుగులో క్రాక్ సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. అయితే చాలా రోజుల తరువాత మళ్లీ క్రాక్ సెట్స్‌పై శ్రుతీ హాసన్ మెరిసింది. వచ్చీ రావడంతోనే శ్రుతీ హాసన్ అంతా సందడిని తీసుకొచ్చినట్టుంది. తాజాగా ఆమె ఓ వీడియోను షేర్ చేసింది.

Shruthi Haasan And Gopichand Malineni Dance In Krack Set
Shruthi Haasan And Gopichand Malineni Dance In Krack Set

తన మేకప్ రూంలో దర్శకుడితో ఎంజాయ్ చేస్తోన్న వీడియోను శ్రుతీ హాసన్ షేర్ చేసింది. శ్రుతీ హాసన్ సెల్పీ తీస్తూ డ్యాన్సులు చేసింది. ఎప్పుడూ నేనే డ్యాన్స్ చేయాలా డైరెక్టర్ గారూ మీరు కూడా చేయండని ఓ రెండు మూడు స్టెప్పులు వేయించింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ విలన్‌గా నటిస్తోంది. తమన్ అదిరిపోయే సంగీతాన్ని అందించాడు.