అందాల తార శ్రియ.. లిప్ కిస్ ఎవ‌రికి ఇస్తుందో తెలుసా?

అందాల తార శ్రియ ఒక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారుకు కునుకు లేకుండా చేసిన సంగ‌తి తెలిసిందే. స్టార్ హీరోల అంద‌రి స‌ర‌స‌న న‌టించిన ఈ ముద్దుగుమ్మ 2018లో ర‌ష్య‌న్ టెన్నిస్ ప్లేయ‌ర్ అందేరిని వివాహం చేసుకుంది. పెళ్ళి త‌ర్వాత కూడా అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తున్న‌ప్ప‌టికీ పెద్ద‌గా గుర్తింపు రావ‌డం లేదు. దీంతో కురచ దుస్తుల్లో ఫొటోలకు ఫోజులిస్తూ వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తోంది. అంతేకాదు త‌న భ‌ర్త‌తో క‌లిసి చేస్తున్న ర‌చ్చ‌కు సంబంధించిన ఫొటోలు వీడియోలు షేర్ చేస్తూ నెటిజ‌న్స్‌ని ఉత్సాహ‌ప‌రుస్తుంది.

న్యూ ఇయ‌ర్‌లో శ్రియా శ‌ర‌ణ్ చేసిన తొలి పోస్ట్ సంచ‌ల‌నం సృష్టించింది. త‌న భ‌ర్త అందేరికి లిప్ లాక్ ఇచ్చిన ఫొటోని షేర్ చేస్తూ.. మీ అంద‌రికి కిస్సెస్, హ‌గ్స్ అంటూ కామెంట్ పెట్టింది. ఈ ఫొటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుండగా, దీనికి నెటిజ‌న్స్ వెరైటీ కామెంట్స్ పెడుతున్నారు. ప్ర‌స్తుతం శ్రియ తెలుగులో ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు ప‌లు త‌మిళ సినిమాలలో నటిస్తుంది. అయితే ఈ అమ్మ‌డు తొలిసారి త‌మిళంలో ‘ఎనక్కు 20.. ఉనక్కు 18’ న‌టించగా, చివ‌రిగా శివాజి ది బాస్ అనే చిత్రం చేసింది.

శ్రియ‌కు త‌మిళంలోను పెద్ద‌గా ఆఫ‌ర్స్ రాక‌పోవ‌డంతో ఈ అమ్మ‌డు గ్లామ‌ర్ షోనే నమ్ముకుంది. పెళ్లైతే ఆఫ‌ర్స్ రావ‌డం క‌ష్ట‌మే అని శ్రియ విష‌యంలో మ‌రోసారి రుజువు అయింది. అయితే స‌మంత మాత్రం అంద‌రికి భిన్నంగా వ‌రుస ఆఫ‌ర్స్‌తో దూసుకెళ్ల‌డం విశేషం. ఓవైపు సినిమాలు మ‌రో వైపు వెబ్ సిరీస్‌ల‌తో అక్కినేని కోడ‌ల‌ని నిరూపించుకుంది