టాలీవుడ్ కన్నా ముందే తమిళ, కన్నడ భాషలో సత్తా చాటుకున్న నటి శ్రద్ధ శ్రీనాథ్. తెలుగులో నాచురల్ స్టార్ నాని జెర్సీ సినిమాతో మంచి హిట్ని అందుకున్నప్పటికీ ఎందుకో ఆమెకి సరైన అవకాశాలు రాలేదని చెప్పాలి. జెర్సీ తరువాత ఆమె కృష్ణ అండ్ హిజ్ లీల, సైంధవ్ వంటి చిత్రాలలో నటించినప్పటికీ అనుకున్నంత సక్సెస్ సాధించలేదు. తాజాగా ఆమె విశ్వక్ సేన్ హీరోగా నటించిన మెకానిక్ రాఖీ సినిమాలో హీరోయిన్ గా నటించింది.
తాజాగా ఆమె ఈ సినిమా గురించి మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమాలో నాది డిఫరెంట్ క్యారెక్టర్, ఇది నాకు చాలా ఎక్సైటింగ్ ప్రాజెక్ట్. మాయ క్యారెక్టర్ని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను, అలాగే ఈ పాత్రని ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాను. ఇప్పటివరకు ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్ చేయలేదు. మెకానిక్ రాఖీ జీవితంలో మాయ ఎలాంటి రోల్ ప్లే చేస్తుందనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది, ఆడియన్స్ కి ఈ సినిమాలో చాలా సర్ప్రైజ్లు, ట్విస్టులు ఉంటాయని చెప్పింది శ్రద్ధ శ్రీనాథ్.
మీ కథలు ఎంపిక ఎలా ఉంటుంది అనే అడిగిన ప్రశ్నకు సమాధానం గా కదా విన్నప్పుడే అది హిట్ అవుతుందా లేదా అనేది చెప్పలేం అని సినిమాలో నా క్యారెక్టర్ కి ఉన్న ప్రాధాన్యతనే చూస్తాను, ఆడియన్ గా ఎలాంటి సినిమాలు చూడటానికి ఇష్టపడతానో అలాంటి కథలలో నటించటానికి ఇష్టపడతాను అని చెప్పింది. అంతేకాకుండా తనకి కల్కి లాంటి సైన్స్ ఫిక్షన్ కథల్లో నటించడానికి ఇష్టమని అలాగే బాహుబలి లాంటి పిరియడ్ సినిమాలో పార్ట్ అవ్వాలని ఉంటుంది అని చెప్పింది శ్రద్ధ శ్రీనాథ్.
మెకానిక్ రాఖీ సినిమా తరువాత తనకి ఇంకా డిఫరెన్స్ రోల్స్ వస్తాయని భావిస్తున్నానని చెప్పింది. ఇక తాను నటించిన డాక్ మహారాజ్ సినిమా సంక్రాంతికి వస్తోందని, తమిళంలో ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నట్లు విష్ణు విశాల్ తో మరొక సినిమా చేస్తున్నట్లు చెప్పింది శ్రద్ధ శ్రీనాథ్. ఈ సినిమా అయినా ఆమెకి మంచి సక్సెస్ ఇవ్వాలని, టాలీవుడ్ లో ఆమెకి మరిన్ని అవకాశాలు రావాలని విషెస్ చెబుతున్నారు ప్రేక్షకులు.