శ్రద్దా.. ఇదేమి హీటు బాబోయ్?

దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీల్లో ఇప్పుడు ఉన్న హీరోయిన్లలో వందకు వంద శాతం మంది సోషల్ మీడియాను ఓ రేంజ్‌లో వాడుతూనే ఉన్నారు. దీని ద్వారానే అందాలను ఆరబోస్తూ యమ హైలైట్ అవుతోన్నారు. అదే సమయంలో ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడుతూ అవకాశాలను సైతం సొంతం చేసుకుంటోన్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రద్దా దాస్ ఒకరు.

చాలా కాలం క్రితమే హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన శ్రద్దా దాస్.. ‘అధినేత’, ‘ఆర్య 2’, ‘మరో చరిత్ర’, ‘నాగవల్లి’, ‘డార్లింగ్’, ‘మొగుడు’, ‘ముగ్గురు’, ‘బందిపోటు’, ‘గుంటూరు టాకీస్’, ‘డిక్టేటర్’, ‘పీఎస్వీ గరుడవేగ’ వంటి ఎన్నో చిత్రాలతో మెప్పించింది. కానీ, వీటిలో పెద్దగా హిట్లు లేకపోవడంతో ఈ అమ్మడు అంతగా సక్సెస్ కాలేకపోయింది.

కెరీర్ పరంగా సక్సెస్ కాకున్నా సోషల్ మీడియాలో మాత్రం శ్రద్దా దాస్‌ రేంజ్ మామూలుగా లేదనే చెప్పాలి. అంతలా ఈ అమ్మడు ఇందులో అందాలను ఆరబోస్తూ కుర్రాకారును హుషారెత్తిస్తోంది. అంతేకాదు, ఇప్పుడు కూడా ఆమెకు కొన్ని ఆఫర్లు వస్తున్నాయంటే కారణం ఇదే అనాలి. ఇంతటి రచ్చ చేస్తోన్న శ్రద్దా.. తాజాగా మరికొన్ని హాట్ పిక్స్‌ను కూడా షేర్ చేసింది.

ఎక్కువ శాతం షూటింగ్‌లతో బిజీగా గడిపే శ్రద్దా దాస్.. ఖాళీ సమయాల్లో మాత్రం హాలీడే ట్రిప్‌లకు వెళ్తుంటుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ అమ్మడు ఓ టూర్‌కు వెళ్లింది. అక్కడ ప్రకృతి సోగయాల నడుమ తన అందాలను చూపిస్తూ తీసుకున్న ఫొటోలను తాజాగా వదిలింది. వీటిలో శ్రద్దా దాస్ ఎద, థైస్ అందాలు యమ హైలైట్ అవుతోన్నాయి. దీంతో ఈ పిక్స్ అన్నీ బాగా వైరల్‌గా మారిపోయాయి.

ఇదిలా ఉండగా.. శ్రద్దా దాస్ ఇప్పుడు ఈటీవీలో వస్తున్న ‘ఢీ’ షోలో 15వ సీజన్‌కు జడ్జ్‌గా చేస్తోంది. ఇందులో కూడా శ్రద్దా తన మార్క్‌తో అలరిస్తోంది. అలాగే, ‘నిరీక్షణ’, ‘అర్థం’ వంటి సినిమాల్లోనూ నటించింది. ఇప్పటికే వీటికి సంబంధించిన షూటింగ్‌లు అన్నీ కంప్లీట్ అయ్యాయి. ఇక, త్వరలోనే ఈ అమ్మడు ఓ క్రేజీ మూవీతో పాటు వెబ్ సిరీస్‌లోనూ నటిస్తుందని సమాచారం.