Koratala Shiva: కొరటాల శివ సినిమాలలో ఆ కామన్ పాయింట్ వుండాల్సిందేనా.. కొరటాల సెంటిమెంట్ ఇదేనా?

Koratala Shiva: టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట రచయితగా పనిచేసిన శివ ఆ తర్వాత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన కొరటాల శివ అతి తక్కువ సమయంలోనే దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని క్రియేట్ చేసుకున్నాడు. మొదటి సినిమానే టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో తెరకెక్కించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ హీరో గా నటించిన మిర్చి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మిర్చి సినిమా హీరో ప్రభాస్ కి మంచి గుర్తింపు తెచ్చి పెట్టడంతో పాటు, దర్శకుడికి కూడా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది.

ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంతో పాటు సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ఆ సమయంలో టాలీవుడ్ లోని పలువురు నిర్మాతలు కొరటాల శివ దర్శకత్వంలో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించారు. మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్న కొరటాల శివకి ఆ తరువాత కూడా వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. అలా మహేష్ బాబు తో శ్రీమంతుడు సినిమా, అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ సినిమాను తెరకెక్కించాడు. శివ దర్శకత్వం వహించిన ప్రతి ఒక్క సినిమా కూడా పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. శ్రీమంతుడు సినిమాలో కొరటాల శివ టేకింగ్ కి ఫిదా అయిన మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను అనే సినిమాను చేశాడు.

ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే… ఇదిలా ఉంటే దర్శకుడు కొరటాల శివ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా ఆచార్య. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే కొరటాలశివ కు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే కొరటాల శివ దర్శకత్వం వహించిన అన్ని సినిమాలలో కూడా ఒక విషయం కామన్ గా ఉంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వం అన్ని సినిమాలలో కూడా హీరోలు అందరూ బ్యాగ్ ధరించి కనిపిస్తారు. అయితే ఇది తలకు ఒక నమ్మకమా లేదంటే సినిమా కథ పరంగా వచ్చిందా అన్నది తెలియదు కానీ సినిమా పూర్తయ్యేలోపు ఏదో ఒక సందర్భంలో హీరో బ్యాగ్ తగిలించుకుని కనిపిస్తాడు. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు, జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్, తాజాగా దర్శకత్వం వహించిన ఆచార్య సినిమాలో కూడా చిరంజీవి ఒక సైడ్ కు బ్యాగు వేసుకుని కనిపించబోతున్నారు.