ప్రస్తుతం కన్నడ పరిశ్రమలో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తోంది. డ్రగ్స్ కేసులో భాగంగా ఇద్దరు హీరోయిన్లను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా డ్రగ్స్ కేసు కాకుండా సెక్స్ రాకెట్ బయటపడుతోందని తెలుస్తోంది. వీరి ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులకు పెద్ద షాక్ తగిలినట్టు సమాచారం.
రాగిణి, సంజనా ఫోన్లలో నీలి చిత్రాలు, అసభ్యకరమైన ఫోటోలు కూడా ఉన్నాయట. ఇందులో సపరేట్ గ్రూప్ పెట్టి సెక్స్ దందా నడిపిస్తున్నారని తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు వాటిపైనా విచారించేందుకు సిద్దమవుతున్నారట. స్కాంతో సంబంధమున్నవారందరికీ నోటీసులిచ్చి విచారణ చేయాలని నిర్ణయించాట. ఇద్దరి మొబైల్ ఫోన్లలో నీలి దందా కోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూపు ఉందని, డ్రగ్స్ కేసు బయటపడగానే ఆ గ్రూపును డిలిట్ చేశారని సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు (సీసీబీ) చెప్పినట్టు తెలుస్తోంది.
ఇక వీరిద్దరు ప్రస్తుతం పరప్పన అగ్రహార జైల్లో ఉన్నారు. నటి రాగిణి, సంజనలు ఇచ్చిన సమాచారం అధారంగా సీసీబీ పోలీసులు మూడు రోజుల నుండి కొందరిని ఆఫీసుకు పిలిపించి ప్రశ్నిస్తున్నారు. రాగిణి సన్నిహితులిద్దరిని చామరాజపేటలోని సీసీబీ ఆఫీసులో విచారించారు. వీరిద్దరూ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది. మాఫియా డాన్‌తో సంబంధాలున్న ఒక యువకున్ని సీసీబీ అదుపులోకి తీసుకొని విచారించింది.