షాకింగ్ : “సలార్” లో ప్రభాస్ ఎంట్రీ అప్పుడే..??

ఈ డిసెంబర్ లో రిలీజ్ కానున్న మరిన్ని బిగ్గెస్ట్ రిలీజ్ లలో అయితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ సినిమా “సలార్” సీజ్ ఫైర్ కూడా ఒకటి. కాగా ఈ సినిమాని ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ సహా హిందీ ఆడియెన్స్ కూడా గట్టిగానే ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమా రిలీజ్ ఇపుడు సమయం దగ్గర పడుతుంది. కానీ అనూహ్యంగా ఈ భారీ చిత్రం రిలీజ్ కి ముందు కొన్ని షాకింగ్ వార్తలే వినిపిస్తున్నాయి. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత చాలా మందికి ప్రభాస్ ఎంట్రీపై అనేక అనుమానాలు స్టార్ట్ అయ్యాయి.

ట్రైలర్ లో చూపించిన కథ ప్రకారం ప్రభాస్ ఎంట్రీ సినిమాలో చాలా సేపు తర్వాతే ఉంటుంది అని అందరికీ అర్ధం అయ్యింది. మరి కన్నడ సినీ వర్గాల నుంచి సమాచారం ప్రకారం అయితే ప్రభాస్ సినిమాలో ఇంటర్వెల్ ముందు వస్తాడని తెలుస్తుంది. ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ తోనే తన కెరీర్ లో మాసెస్ట్ ఇంటర్వెల్ గా నిలిచిపోయేలా ఉంటుంది అని అంటున్నారు.

ఐతే సలార్ ఫస్టాఫ్ తక్కువే ప్లాన్ చేసి సెకండాఫ్ ఎక్కువ ప్లాన్ చేశారట. దీనితో ఈ ప్రభాస్ ఎంట్రీ కాస్త లేట్ గానే వచ్చినా తర్వాత మాత్రం ఫుల్ గా ఉంటాడని తెలుస్తుంది. మరి ఈ విషయంలో ఆడియెన్స్ ప్రభాస్ ఎంట్రీని ఎలా తీసుకుంటారో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎలా దీనిని హ్యాండిల్ చేసాడో చూడాల్సి ఉంది. మరి దీని కోసం అయితే ఈ డిసెంబర్ 22 వరకు ఆగాల్సిందే.