షాకింగ్ : షారుక్ ఖాన్ కి యాక్సిడెంట్!

ఒక్క బాలీవుడ్ సినిమా దగ్గరే కాకుండా ఇండియన్ సినిమా దగ్గరే అతి పెద్ద హీరోస్ లో ఒకరు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ అని చెప్పాలి. ఇపుడు తనకి 60 ఏళ్ళు ఉన్నప్పటికీ ఆడితే ఫిట్నెస్ తో క్రేజీ చిత్రాలు చేస్తున్న షారుక్ ఖాన్ లేటెస్ట్ గా అయితే “పఠాన్” తో సెన్సేషనల్ కం బ్యాక్ ని అందించి దుమ్ము లేపాడు.

కాగా ఈ సినిమా తర్వాత షారుక్ ఖాన్ జవాన్, డున్కి తదితర భారీ చిత్రాలు చేస్తున్నారు. మరి ఇదిలా ఉండగా షారుక్ పై అయితే తన సినిమాల షూటింగ్ లో ఓ సినిమాకి సంబంధించి అయితే ఓ షాకింగ్ న్యూస్ ఇప్పుడు లేట్ గా బయటకి వచ్చింది.

మరి మరిన్ని డీటెయిల్స్ లోకి వెళ్లినట్టు అయితే యూఎస్ లాస్ ఏంజెల్స్ లో షారుక్ ఖాన్ ఓ సినిమా షూటింగ్ లో పాల్గొనగా అక్కడ షారుక్ ఖాన్ ని ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అయ్యిందట. దీనితో వెంటనే షారుక్ ని హాస్పిటల్ కి తరలించారట. అంతేకాకుండా తనకి సర్జరి కూడా జరిగిందని రూమర్స్ వినిపిస్తున్నాయి.

అయితే షారుక్ ఇపుడు ఆరోగ్యంగానే ఉన్నారని ఇండియాకి కూడా తాను వస్తున్నట్టుగా బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఇదిలా ఉండగా షారుక్ నటిస్తున్న జవాన్ చిత్రాన్ని తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తుండగా ఈ సినిమాపై భారీ హైప్ ఉంది. అలాగే ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో ఈ సెప్టెంబర్ లో అయితే రిలీజ్ కాబోతుంది.