షాకింగ్ : టాలీవుడ్ మరో సీనియర్ నటి ఇక లేరు.!

ఈరోజు ఉదయంతోనే మళ్ళీ టాలీవుడ్ లో విషాద ఉదయంగా నిలిచింది అని చెప్పాలి. గత కొన్ని వారాలు నెలలు కితమే ఉదయంతో నే పలువురు దిగ్గజ నటుడు ఇక లేరు అంటూ వచ్చిన వార్తలు చిత్ర పరిశ్రమని ఎంతగానో కలచి వేసాయి. మరి వరుసగా కృష్ణం రాజు, సూపర్ స్టార్ కృష్ణ, చలపతి రావు కైకాల లాంటి ఎందరో వెర్సటైల్ నటులు హీరోలని మన తెలుగు సినిమా కోల్పోయింది.

కాగా ఇప్పుడు మరి సీనియర్ నటి అయితే కన్ను మూసినట్టుగా సినీ వర్గాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరి మరిన్ని డీటెయిల్స్ లోకి వెళితే టాలీవుడ్ దగ్గర అలనాటి సినిమాల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి దిగ్గజాలతో నటించిన ధృవ తార హీరోయిన్ జమున ఇప్పుడు కాలం చేశారు.

ఈరోజు ఉదయం అయితే వారి ఇంట్లోనే వయసుకు సంబంధించిన సమస్యలతో అయితే ఆవిడ కన్ను మూసినట్టుగా ఇప్పుడు వార్తలు వచ్చాయి. మరి టాలీవుడ్ లో పుట్టిల్లు సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఆమె తెలుగులో 100 కి పైగా చిత్రాల్లో నటించారు అలాగే తమిళ్, సహా హిందీ భాషల్లో ఆమె నటించారు.

అయితే వీరు పుట్టింది కర్ణాటకలో అయినప్పటికీ తెలుగులో అద్భుతంగ రాణించారు. అలాగే రాజకీయాల్లో లో ఎంపీ గా చేశారు. ఇలా తెలుగు చిత్రానికి తెలుగు ఆడియెన్స్ ని ఎన్నో సేవలు అందించిన వీరి అకాల మరణం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన నటులు అనేకమంది దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ఆమె ఆత్మకి శాంతి చేరాలని కోరుకుంటున్నారు.