శ్రీముఖి పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్!

Sreemukhi: బుల్లితెర మీద సందడి చేస్తున్న ఎన్నికలలో శ్రీముఖి కూడా ఒకరు. తన చిలిపి చేష్టలతో కామెడీతో యాంకర్ గా మంచి గుర్తింపు పొందింది. శ్రీముఖి యాంకర్ గా మాత్రమే కాకుండా పలు సినిమాలలో నటించింది నటిగా కూడా మంచి గుర్తింపు పొందింది.బుల్లితెర మీద ప్రసారం అవుతున్న ఎన్నో టీవీ షోస్ కి యాంకర్గా వ్యవహరించిన శ్రీముఖి ప్రస్తుతం సరిగమప సింగింగ్ షో, జాతి రత్నాలు వంటి షోస్ కి యాంకర్ గా వ్యవహరిస్తోంది. అయితే ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న బ్యాచులర్స్ కి ఎదురయ్యే ఒకే ఒక్క ప్రశ్న పెళ్లి.

పది సంవత్సరాలుగా ఇండస్ట్రీలో యాంకర్గా నటిగా కొనసాగుతున్న శ్రీముఖి కూడా ఎన్నోసార్లు ఈ ప్రశ్న ఎదుర్కొంది. అయితే శ్రీముఖి బిగ్ బాస్ లో పాటిస్పేట్ చేసిన సమయంలోనే తన పెళ్లి గురించి అందరికి ఒక క్లారిటీ ఇచ్చింది. ఇండస్ట్రీలో లో ఉండి పది సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ శ్రీముఖి ఇంకా పెళ్లి చేసుకోక పోవటం తో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికి ఎన్నో సార్లు శ్రీముఖి పెళ్లి గురించి రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.

అయితే ఇటీవల శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్న జాతిరత్నాలు అనే షోలో శ్రీముఖి పెళ్లి గురించి ఫన్నీ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ షో కి సంబంధించిన ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ షోలో శ్రీముఖి నా పెళ్లెప్పుడు అవుతుంది అని అడగగా.. “తిన్న విస్తరాకు కడిగి వాడటం, నూకరాజు తెల్లగా అవ్వడం, నీకు పిలవటం ఈ జన్మలో జరగని పని ” అంటూ కామెంట్స్ చేశారు. దీంతో శ్రీముఖి ఒక్కసారిగా షాక్ అయ్యింది. అయితే శ్రీముఖి పెళ్లి వార్త ఎప్పుడు చెప్తుంది అని చాలామంది ఎదురుచూస్తున్నారు.