మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన గత చిత్రం “గని” తన కెరీర్ లో భారీ డిజాస్టర్ అయ్యిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం తర్వాత వచ్చిన చిత్రం “ఎఫ్ 3” మళ్ళీ పెద్ద హిట్ అయ్యింది. అయితే నెక్స్ట్ మళ్ళీ తాను చేసిన సోలో చిత్రమే “గాండీవధారి అర్జున”.
దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈ చిత్రం ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఈ సినిమాకి భారీ బడ్జెట్ ని మేకర్స్ పెట్టేసారు. అలాగే ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు కానీ సినిమాలో కంటెంట్ తేలిపోవడంతో ఈ చిత్రానికి దారుణమైన ఓపెనింగ్స్ వచ్చినట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి.
కాగా ఈ సినిమాతో వచ్చిన మరో హీరో కార్తికేయ బెదురులంక కి ఇంకా మంచి వసూళ్లు వచ్చాయట. అయితే కార్తికేయ చిత్రానికి 1.7 కోట్లకి పైగా గ్రాస్ వస్తే వరుణ్ తేజ్ చిత్రానికి దీనికన్నా తక్కువ వసూళ్లు వచ్చాయని ట్రేడ్ చెప్తున్నారు. ఇక దానిని బట్టి ఈ చిత్రం ఎంత దారుణమైన ఓపెనింగ్స్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనితో ఈ సినిమా ఓపెనింగ్స్ వరుణ్ తేజ్ కెరీర్ లోనే అత్యంత తక్కువ మొత్తంలో వచ్చాయని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. మరి తన సినిమాల పట్ల వరుణ్ తేజ్ మళ్ళీ ఏమన్నా ఆలోచింది చూడాల్సిందే.