గత కొన్నాళ్ల నుంచి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ఏదన్నా ఉంది అంటే అది “సలార్” అనే చెప్పాలి. కాగా ఈ చిత్రం కన్నా ముందే ఆల్రెడీ మూడు చిత్రాలతో భారీగా దెబ్బ తిని ఉన్న వారు ఇక అంతా కూడా అన్ని అంచనాలు ప్రశాంత్ నీల్ సలార్ పైనే పెట్టుకున్నారు.
కాగా ఇప్పుడు అయితే ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 28 నే ఎలాంటి ఇబ్బంది లేకుండా రిలీజ్ కి వస్తుంది అని ఫ్యాన్స్ ఎదురు చూస్తూ వచ్చారు. కానీ ఇపుడు ఫ్యాన్స్ కి స్యైతే షాకింగ్ ట్విస్ట్ మళ్ళీ తప్పేలా లేదు అని సినీ వర్గాలు వారు చెప్తున్నారు. దీని ప్రకారం అయితే సలార్ సినిమా ఈ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ కి పోస్ట్ పోన్ చేసారని ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి.
అయితే దీనికి కారణం ఇంకా సినిమాలో గ్రాఫిక్స్ వర్క్స్ చాలా బాలన్స్ ఉండడం వల్లనే అని అంటున్నారు. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ అండ్ టీం చాలానే కష్టపడుతున్నారు అంట కానీ ఈ ఫాస్ట్ మూమెంట్ లో అయితే ఈ సెప్టెంబర్ రిలీజ్ కష్టమే అని అంటున్నారు.
దీనితో అక్టోబర్ లేదా డిసెంబర్ నెలకే సినిమా షిఫ్ట్ అవుతుంది అని ఇప్పుడు బజ్ వినిపిస్తుంది. మరి ఇదే నిజం అయితే ఫ్యాన్స్ కి బాగా డిజప్పాయింట్మెంట్ అయ్యే న్యూస్ అని చెప్పక తప్పదు. ఇంకా దీనిపై అఫీషియల్ అనౌన్సమెంట్ అయితే రానుంది.