ఇన్సైడ్ టాక్ : ధనుష్ ఫస్ట్ తెలుగు ప్రాజెక్ట్ కి షాకింగ్ బడ్జెట్.?

Dhanush-Sir (1)

ప్రస్తుతం తమిళ్ సినిమా నుంచి వచ్చి తెలుగులో కూడా మంచి సక్సెస్ అయ్యిన హీరోగా గ్లోబల్ హీరో ధనుష్ నిలిచాడు. ఇంతకు ముందు డబ్బింగ్ సినిమాలతో వచ్చాడు కానీ ఈసారి ‘సార్’ సినిమాతో అయ్యితే సూపర్ హిట్ వెల్కమ్ ని అందుకొని తన కెరీర్ లోనే భారీ హిట్ ని తాను అందుకున్నాడు.

అయితే దీని కన్నా ముందే ధనుష్ నుంచి తెలుగు లో తెలుగు దర్శకునితో అనౌన్స్ చేసిన సినిమా ఇంకొకటి ఉంది. అలాగే టెక్నీకల్ గా చెప్పాలి అంటే ఇదే ధనుష్ ఫస్ట్ తెలుగు సినిమా కూడా అని చెప్పాలి. మరి ఈ సినిమానే దర్శకుడు శేఖర్ కమ్ముల తో అనౌన్స్ చేసిన సినిమా.

అయితే ఈ సినిమా శేఖర్ కమ్ముల రెగ్యులర్ ఫార్మాట్ నుంచి కాకుండా కంప్లీట్ కొత్త స్క్రిప్ట్ తో అయితే ప్లాన్ చేశారు. కానీ ధనుష్ కి ఉన్న ఇతర కమిట్మెంట్స్ తో అయితే కాస్త ఈ సినిమా ఆగుతున్నా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పై ఓ షాకింగ్ బజ్ అయితే వినిపిస్తుంది. ఈ సినిమాకి గానునిర్మాతలు అయితే షాకింగ్ బడ్జెట్ ని కేటాయిస్తున్నారట.

సినీ వర్గాలు చెప్తున్నా దాని ప్రకారం అయితే సినిమా బడ్జెట్ సుమారుగా 150 కోట్లు కి లాక్ చేశారట. మరి ఇది ప్రస్తుతానికి ధనుష్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ కాగా శేఖర్ కమ్ముల కెరీర్ లో కూడా ఇదే మాసివ్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ గా తెరకెక్కనుందట. అలాగే అతి త్వరలోనే ఈ సినిమా షూట్ కూడా స్టార్ట్ కానుంది.