షాకింగ్ : కైకాల వార్త మరవకుండానే మరో సీనియర్ నటుడు మృతి.!

టాలీవుడ్ లో నిజంగానే ఈ ఏడాది ఒక పీడకల లాంటి ఏడాదిగా మారిపోయింది అని మరోసారి చెప్పక తప్పట్లేదు. ఆల్రెడీ మొదటి నెల నుంచే ఇప్పటివరకు ఎంతో మంది సీనియర్ నటులు అందులోని అగ్ర తారలు వెర్సటైల్ నటులు కన్ను మూశారన్న వార్తలు షాకింగ్ గా మారుతూ వస్తున్నాయి.

ఇక జస్ట్ ఈ మూడు నాలుగు నెలల్లోనే ఊహించని విధంగా కృష్ణం రాజు, సూపర్ స్టార్ కృష్ణ లాంటి బిగ్ స్టార్స్ కూడా కన్ను మూసారు. ఇక ఇవి మరవకుండానే మరో నట శిఖరం చలపతి రావు గారు కన్ను మూశారన్న వార్త ఇప్పుడు బిగ్ షాక్ గా మారింది. ఇక మరిన్ని వివరాల్లోకి వెళితే..

చలపతి రావు హైదరాబాద్ లోనే నివాసం ఉంటుండగా ఈరోజు ఉదయం సడెన్ హార్ట్ స్ట్రోక్ రావడం కారణంగా అయితే ఆయన తన తుది శ్వాస విడిచినట్టుగా తెలుగు సినీ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి. మరి తాను 78 సంవత్సరాల వయసులో దాదాపు 50 ఏళ్ళకి పైగా ఇండస్ట్రీలో ఉన్నారు. పైగా 1000కి పైగా సినిమాల్లో నటించి పలు చిత్రాలు నిర్మాణం కూడా వహించారు.

ఇక పలు ఫ్యాక్షన్ సినిమాల్లో అయితే తన పాత్రలు ఏ లెవెల్లో ఉండేవో కూడా చెప్పక్కర్లేదు. “ఆది”, “చెన్నకేశవ రెడ్డి” లాంటి చిత్రాల్లో తన రోల్స్ ఇప్పటికీ ఐకానిక్ గా ఉంటాయి. మరి ఇలాంటి నటులు ఇప్పుడు లేరు అనే వార్త టాలీవుడ్ లో అందులోని ఇంత తక్కువ కాలంలో వినాల్సి ఉంటుంది అనేది ఊహించనిది. మరి ఈ వార్త విన్న సినీ ప్రముఖులు అయితే దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.