షాకింగ్ : సీనియర్ నటుడు చంద్రమోహన్ ఇక లేరు..!

గడిచిన రెండేళ్లలో అయితే తెలుగు సినిమా దగ్గర ఊహించని విధంగా వరుసగా తెలుగు సినిమా దిగ్గజ నటులు వరుసగా కన్ను మూయడం టాలీవుడ్ కి ఒక షాకింగ్ ఎరా గా మారింది. దీనితో టాలీవుడ్ లో కూడా ఒక రకమైన టెన్షన్ కూడా స్టార్ట్ అయ్యింది. కానీ తర్వాత పరిస్థితి ఓకే అనిపించింది.

కానీ ఇపుడు మరో షాకింగ్ వార్త అయితే ఇప్పుడు టాలీవుడ్ సినీ వర్గాల్లో బయటకి వచ్చింది. తెలుగు సినిమాకి అపారమైన సేవని అందించిన ప్రముఖ సీనియర్ నటుడు అయినటువంటి చంద్రమోహన్ నిన్న రాత్రి సమయంలో తన ఆఖరి శ్వాస విడిచినట్టుగా ఇపుడు వార్తలు బయటకి వచ్చాయి.

కాగా ఆయన గత కొంత కాలం నుంచి వయసు సంబంధిత సమస్యలు పైగా హృద్రోగ సమస్యలతో బాధపడుతున్నారు. దీనితో నిన్న రాత్రి అపోలో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటుండగా అయన కన్ను మూసారు. దీనితో ఈ విషాద వార్తతో టాలీవుడ్ దిగ్బ్రాంతికి లోనయ్యింది.

మరి 1966లో చంద్రమోహన్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వగా అక్కడ నుంచి తాను ఎన్నో వందల సినిమాలు చేసారు. అలాగే ఆయనికి ఒక ఫిలిం ఫేర్ అవార్డు మరియు రెండు నంది అవార్డులు తన నటనకి గాను వచ్చాయి. మరి వారు లేని లోటు ఇండస్ట్రీకి ఎప్పటికీ తీర్చలేనిది. మరి ఈ వార్తతో అయితే సినీ ప్రముఖులు చంద్ర మోహన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.