షాకింగ్ ఫ్యాక్ట్ : అనసూయ, విజయ్ ని ఇందుకే టార్గెట్ చేసిందట.!

తెలుగు బుల్లితెర యాంకర్ చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలోకి రావడంతోనే యంగ్ హీరో విజయ్ దేవరకొండ ని టార్గెట్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టడం అది కాస్తా చినిగి చినిగి చాటయ్యి పైగా ఇతర స్టార్ హీరోలు తన కోసం స్టాండ్ తీసుకోవాలి అని చెప్పడం కాంట్రవర్సీ గా మారుతూ వచ్చింది.

ఇక ఇంత సడెన్ గా అనసూయ వచ్చి విజయ్ దేవరకొండ నే ఎందుకు టార్గెట్ చేసింది అనేది చాలా మందికి అర్ధం కాలేదు. అయితే ఈ మేటర్ వెనుక ఓ ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్ ఫ్యాక్ట్ ఉన్నట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి. విజయ్ దేవరకొండ నటించిన “లైగర్” డిజాస్టర్ తర్వాత ఓ పార్టీ లో విజయ్ కి అలాగే అనసూయ భరద్వాజ్ భర్త కి ఎక్కడో ఏదో చిన్న గొడవ అయ్యిందట.

దీనితో విజయ్ కూడా గట్టిగానే సమాధానం చెప్పాడని తెలుస్తుంది. దీనితో ఈ విషయాన్ని పట్టుకొని ఇపుడు అనసూయ విజయ్ ని టార్గెట్ గా చేసుకుని ట్వీట్ చేసింది అని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇలా పర్సనల్ గొడవలని సోషల్ మీడియాలో పెట్టుకొని అనసూయ ఇలా మాట్లాడుతుంది అని దీని వెనుక కారణం ఇదే అంటూ టాక్ మొదలైంది.

మరి అసలు కారణం ఇదేనా కాదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం విజయ్ అయితే తన మరో పాన్ ఇండియా సినిమా “ఖుషి” లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.