షాకింగ్ : అస్తమించిన విప్లవ గీతం..గద్దర్ 

తెలంగాణ నేలకి సంబంధించి ఆ పేరు మొట్ట మొదట వింటే గుర్తుకొచ్చేది అచ్చమైన జానపదం అంతకు మించి తెగువ విప్లవం. ఇలా ఈ అన్నిటికి కలయికలో తెలంగాణా ప్రాంతం ఎంతో ప్రసిద్ధి గాంచింది. అలాగే తెలంగాణ లోనే అనేకమంది కళాకారులు మన తెలుగు నేలకి చెందిన పాతకాలపు ఆచారాలు సంప్రదాయాల్ని సంగీతం ఇతర కళలు ద్వారా నేటి తరానికి కూడా చాటి చెప్తున్నారు.

మరి అలాంటి వారిలో విప్లవ గళం ప్రముఖ గాయకుడు గద్దర్ కూడా ఒకరు. గుమ్మడి విట్టల్ రావు అలియాస్ గద్దర్ ఎన్నో పోరాటాలు తెలంగాణ గడ్డ మీద ఉండి చేశారు. మరి అలాంటి తాను ఇప్పుడు లేరు అనే మాట చెప్పక తప్పడం లేదు. గత కొన్నాళ్ల నుంచి హృదయ సమస్యలతో బాధ పడుతున్న తాను హైదరాబాద్ లో అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

మరి గత కొన్ని రోజులు కితం ప్రముఖ హీరో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా గద్దర్ ని కలిసి పరామర్శించారు. మరి ఈ గ్యాప్ లోనే ఆయన  మూసారు అనే చేదు వార్త ఇప్పుడు వచ్చింది. మరి తెలంగాణాలో 1948లో జన్మించిన తాను తన జీవితాన్ని తెలంగాణ నేల తల్లికే అంకితం చేశారు.

పలు చిత్రాల్లో ప్రైవేట్ గా అనేక విప్లవ గీతాలను తాను ఆలపించారు. మరి అలాంటి తానూ ఇప్పుడు లేరు అనే వార్త తెలంగాణ నేల మీద ఓ తీరని విషాదం అని చెప్పాలి. ఈ చేదు వార్తతో సినీ ప్రముఖులు అనేకమంది ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి అని ప్రార్థిస్తున్నారు.