Shruti Haasan Got Married : శృతిహాసన్ పెళ్లయిపోయిందట. నిజ్జంగా నిజం. అదేంటీ.? ఎక్కడా ఫోటోలు లీక్ కాలేదు. అనౌన్స్‌మెంటే చేయలేదు. అనుకుంటున్నారా.? ఇంతకీ వరుడు ఎవరు.? అని రకరకాల డౌటానుమానాలు నాన్‌స్టాప్‌గా వచ్చేస్తున్నాయా.? మీకు అంతా తొందరే మరి.
ఇదేమీ అందర్నీ పిలిచి తాళి కట్టి ఒక్కటైన పెళ్లి బంధం కాదండీ. ఇదో టైపు. అలాగని సహజీవనాలు గట్రా అనుకునేరు మళ్లీ. అది వేరే టైపులెండి. ఇంతకీ శృతిహాసన్ పెళ్లి ట్విస్టేంటంటారా.? కాస్త ఫ్లాష్ బ్యాక్‌కి వెళ్లొద్దాం.
ఆ మధ్య మైఖేల్ కోర్సలే అనే కుర్రోడితో శృతిహాసన్ ప్రేమలో పడి, కొన్నాళ్లు లివింగ్ రిలేషన్‌షిప్ అదేనండీ సహజీవనాలు అవీ ఇవీ ఎంజాయ్ చేసేసి, ఏకంగా ఇంటికి తీసుకొచ్చి తండ్రికి కూడా పరిచయం చేసేసింది.
సో, ఈ పాప ఓ ఇంటిదైపోతుందనుకున్నారంతా. కానీ, అదంతా తూచ్.! అయిపోయింది. ఆ మైక్‌తో బ్రేకప్ చెప్పేసుకుని, తాజాగా మరో కుర్రోడితో చెట్టాపట్టాలేసుకు తిరుగుతోంది శృతిహాసన్. ఆ కుర్రోడి పేరే శాంతనూ హజారికా.
ఈ శాంతనూ ఓ ఆర్టిస్టు అట. అదేనండీ బొమ్మలూ గట్రా వేస్తారు కదా.. ఆయనన్న మాట. సరే, మరి వీరిద్దరూ పెళ్లెప్పుడు చేసేసుకున్నారబ్బా.! అనే కదా.. తాళి కట్టి చేసుకున్న పెళ్లేం కాదట. కానీ, మానసికంగా మా ఇద్దరికీ పెళ్లియిపోయిందంటూ, ఇదిగో ఈ ఆర్టిస్టుగారే సోషల్ మీడియా ద్వారా వెల్లడి చేశారట. ఇది విన్ననెటిజనం, ఇదేం వింతరా బాబూ.. అంటూ జుట్టు పీక్కుంటున్నారు.