ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర మోస్ట్ బిజీగా ఉన్న హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాగా తాను నటించిన రీసెంట్ చిత్రాలు సలార్ అలాగే కల్కి చిత్రాలు అయితే పాన్ ఇండియా మరియు పాన్ వరల్డ్ సినిమా బాక్సాఫీస్ లను టార్గెట్ పెట్టుకొని రిలీజ్ కాబోతుండగా ప్రభాస్ మిగతా స్టార్ హీరోస్ తో పోలిస్తే తన సినిమాలు పరంగా సోషల్ మీడియాలో కాస్త స్లో గానే ఉంటాడు.
అయినా కూడా సోషల్ మీడియాలో కూడా ప్రభాస్ కి భారీ క్రేజ్ ఉంది. కాగా ప్రభాస్ నుంచి అయితే ఇప్పుడు షాకింగ్ న్యూస్ అయితే ఒకటి బయటకి వచ్చింది. ప్రభాస్ యొక్క ఫేస్ బుక్ అకౌంట్ ని అయితే ఎవరో హ్యాక్ చేశారట. దీనితో ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ షాకింగ్ న్యూస్ ని షేర్ చేసి నా ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యింది.
మా టీం దానిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అని తెలిపాడు. దీనితో ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. మరి ప్రభాస్ అకౌంట్ ని హ్యాక్ చేసి హ్యాకర్లు ఏం చేసుకుంటారో కానీ అదేదో లూటీలు చేసే పెద్దోళ్ల అకౌంట్స్ హ్యాక్ చేసి వారి డబ్బులు ఏమన్నా చేస్తే బెటర్..
ఇక ప్రభాస్ నటించిన సలార్ నుంచి అతి త్వరలోనే భారీ అప్డేట్ ఫస్ట్ సాంగ్ కోసం రానుండగా ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు అయితే కల్కి నుంచి ఎలాంటి అప్డేట్స్ ఉండవ్ అని తెలుస్తుంది. ఇక రీసెంట్ గానే ప్రభాస్ ఆదిపురుష్ చిత్రంతో థియేటర్స్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
Hello everyone,
My Facebook page has been compromised. Team is sorting this out. – #Prabhas via Instagram. pic.twitter.com/G86FV2UABU
— Prasad Bhimanadham (@Prasad_Darling) July 27, 2023