గాడ్ ఆఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో రీసెంట్ గానే స్టార్ట్ అయ్యిన ఓ పక్కా ఏక్షన్ థ్రిల్లర్ చిత్రం “ఓజి” కూడా ఒకటి. ప్రస్తుతానికి “ఒరిజినల్ గ్యాంగ్ స్టర్” గ్యాంగ్ స్టర్ అంటూ చలామణి అవుతున్న ఈ సినిమాని యంగ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్నాడు.
నిన్ననే పవన్ కూడా సినిమా షూటింగ్ లో జాయిన్ కాగా చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు ఓ రేంజ్ లో అప్డేట్స్ తో హోరెత్తిస్తున్నారు. కాగా ఇదిలా ఉండగా ఈ సినిమా విషయంలో ఇప్పుడు ఓ ఊహించని ఇంట్రెస్టింగ్ ఫాక్ట్ అయితే బయటకి వచ్చింది.
ఇప్పుడు ఈ సినిమాకి ఓజి అనే టైటిల్ అందరికీ బాగా రిజిస్టర్ అయ్యిపోయింది. కానీ ఇంట్రెస్టింగ్ అంశం ఏంటి అంటే అసలు ఇది ఈ సినిమా అఫీషియల్ టైటిల్ కాదట. ఈ చిత్రానికి మరో టైటిల్ ఉందని కానీ ప్రస్తుతానికి వర్క్ టైటిల్ లా మాత్రం ఈ ఓజి ని అనౌన్స్ చేసారని స్వయంగా పవన్ పి ఆర్ టీం నుంచే సమాచారం వచ్చింది.
దీనితో ఈ సినిమాకి టైటిల్ విషయంలో ఇలాంటి ట్విస్ట్ ఉంటుంది అని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. ఇక ఈ సినిమా అయితే ఇపుడు ముంబై లో భారీ ఏక్షన్ షెడ్యూల్ తో స్టార్ట్ కాగా దీనిని ఈ నెలాఖరు వరకు కంటిన్యూ చేయనున్నట్టుగా తెలుస్తుంది. అంతే కాకుండా ఏక్షన్ సీన్స్ తో పాటుగా పవన్ పై పలు కీలక సన్నివేశాలు కూడా తెరకెక్కించనున్నారని సమాచారం.
