హాట్ టాపిక్ : నార్త్ లో రివర్స్ షాకిచ్చిన “సలార్” నిర్మాత

ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లో ఎన్నో అంచనాలు నడుమ రిలీజ్ కి రాబోతున్న బిగ్గెస్ట్ చిత్రాల్లో అటు హిందీ నుంచి కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన “డన్కి” రాబోతుండగా దీనితో పాటుగా తెలుగు నుంచి స్టార్ హీరో ప్రభాస్ నటించిన బిగ్గెస్ట్ చిత్రం “సలార్” కూడా రాబోతుంది.

దీనితో ఈ ఊహించని బిగ్గెస్ట్ క్లాష్ విషయంలో చాలా మంది ఆసక్తిగానే ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమా విషయంలో ఇప్పుడు మారుతున్నా సమీక్షరణాలు ఆసక్తి రేపుతున్నాయి. కాగా సలార్ సినిమాకి నార్త్ మార్కెట్ లో కూడా భారీ క్రేజ్ ఉంది. కానీ ఇక్కడ నార్త్ లో ప్రముఖ థియేటర్స్ సంస్థలు అయినటువంటి పివిఆర్, ఐనాక్స్ లాంటి నేషనల్ చైన్స్ లో సలార్ హిందీ రిలీజ్ ని తాము చేయడం లేదని షాకిచ్చారు.

దీనికి కారణం అన్ని స్క్రీన్స్ ని హిందీ సినిమా అయిన డన్కి కి మాత్రమే కేటాయించడం ఇప్పుడు కాంట్రవర్సియల్ గా మరియు హాట్ టాపిక్ గా మారింది. కానీ వారు చెప్పేది ఏమిటంటే తాము నార్త్ లో స్క్రీన్స్ ఇవ్వం కానీ సౌత్ లో స్క్రీన్ ఇస్తామని చెప్పారట.

కానీ దీనికి రివర్స్ లో సలార్ నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్స్ వారు మాకు సౌత్ కూడా అక్కర్లేదు చేస్తే అన్ని చోట్ల కావాలని కానీ అక్కడ ఇవ్వకపోతే ఇక్కడ స్క్రీన్స్ మాకు అవసరం లేదని ఇక్కడ వారి స్క్రీన్స్ లో రిలీజ్ ని ఆపేసారు. దీనితో ఈ పాలిటిక్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు ఆగ్రహంగా ఉన్నారు.