షాకింగ్ : “ఆదిపురుష్” థియేటర్స్ లోకి దళితులకు ఎంట్రీ లేదు.!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ భారీ సినిమా “ఆదిపురుష్” పై ఇప్పుడు ఎందుకో రిలీజ్ దగ్గర పడుతున్న సమయంలో ఊహించని కాంట్రవర్సీ లు ఇపుడు పెద్ద ఎత్తున వైరల్ గా మారుతున్నాయి. కాగా ఈ వార్తల్లో అయితే నిన్ననే హీరోయిన్ కృతి సనన్ అలాగే దర్శకుడు ఓంరౌత్ లు తిరుమల సన్నిధిలో చేసిన చేష్టలు షాకింగ్ గా మారాయి.

అయితే ఇది కాకుండా సోషల్ మీడియాలో మరో షాకింగ్ అంశం ఒకటి వైరల్ గా మారింది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ లా ఒక దానిలో అయితే అయితే ఆదిపురుష్ చిత్ర ప్రదర్శనలో ఈ సినిమా వీక్షించేందుకు థియేటర్స్ లో దళితులకు ఎంట్రీ లేదు అంటూ ఓ షాకింగ్ ప్రెస్ నోట్ వైరల్ గా మారింది.

దీనితో ఒక్క క్షణం సోషల్ మీడియాలో అంతా నిజమేనా అనుకున్నారు అయితే దీనిపై వెంటనే చిత్ర యూనిట్ బదులిచ్చారు. ఇది పక్కా ఫేక్ ప్రచారం అని తాము ఎక్కడా ఎవరికీ ఎలాంటి ఎంట్రీ లేదని ప్రెస్ నోట్ రిలీజ్ చేయలేదని ఇది మన భారతీయుల సినిమా ప్రతి ఒక్కరూ వీక్షించాలి అని కోరారు.

అయితే ఈ సినిమా విషయంలో ఇంత దిగజారుడుతనంగా ప్రవర్తించాలని ఎవరికి అనిపించిందో అని ప్రభాస్ ఫ్యాన్స్ సహా నెటిజన్స్ ఈ ప్రెస్ నోట్ డిజైన్ చేసిన వాడిని తిట్టుకుంటున్నారు. ఇక ఈ భారీ సినిమా ఈ జూన్ 16న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.