దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం..ప్రముఖ సంతాపం

తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి మోస్ట్ సక్సెస్ ఫుల్ అండ్ మోస్ట్ ఇంటెలిజెంట్ నిర్మాతల్లో ప్రముఖ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కూడా ఒకరు. మరి దిల్ రాజు ఇపుడు అనేక చిత్రాలు నిర్మాణం సహా డిస్ట్రిబ్యూషన్ కూడా అందిస్తుండగా తాను తన పర్శనల్ లైఫ్ లో కూడా ఎంతో ఆనందంగా జీవనం కొనసాగిస్తున్నారు.

అయితే ఈ సమయంలో దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం నెలకొనడం షాకింగ్ గా మారింది. ఇక మరిన్ని వివరాల్లోకి వెళితే దిల్ రాజు కన్నా తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి అకాల మరణంతో అయితే ఇపుడు దిల్ రాజు ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే శ్యామ్ సుందర్ రెడ్డి కి 86 కాగా తాను గత కొంత కాలం నుంచి వయసు సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు.

దీనితో హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు కానీ పరిస్థితి చేజారడంతో నిన్న రాత్రి సమయంలో ఆయన తన తుది శ్వాస విడిచారు. దీనితో దిల్ రాజుకి పితృ వియోగం జరిగింది. ఇక ఈ విషాద వార్తతో అయితే టాలీవుడ్ కి చెందిన అనేకమంది ప్రముఖులు దిల్ రాజు కి ధైర్యం చెబుతూ వారు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. దీనితో ఈ షాకింగ్ వార్త సినీ వర్గాల్లో విషాదంగా మారింది.
https://x.com/megopichand/status/1711582661477793941?s=20