షాకింగ్ : ఆ పార్టీకి ఎన్నికల ప్రచారంలో బ్రహ్మానందం.!

ఇప్పుడు రోజుల్లో సినిమాలు పాలిటిక్స్ వేరు వేరుగా లేకుండా ఒకటిగానే ఉన్నాయని చెప్పాలి. చాలా మంది సినీ ప్రముఖులు రాజకీయాల్లో ఉండడం, రాజకీయాల్లో ఉండేవాళ్ళు సినిమాల్లోకి రావడం సినిమా వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం అనేది సర్వ సాధారణంగా మారిపోయింది.

అయితే ఈ లిస్ట్ లో లేటెస్ట్ గా ఊహించని వ్యక్తి దిగ్గజ కమెడియన్ బ్రహ్మానందం కూడా చేరడం ఒకింత షాకింగ్ గా మారింది అని చెప్పాలి. అయితే ఇది వరకు పొలిటికల్ గా బ్రహ్మానందం ఎవరి మీదా కామెంట్ చేసింది కానీ లేదా పొలిటికల్ గా ఏ పార్టీ కి గాని ప్రచారం చేసింది లేదు.

అయితే లేటెస్ట్ గా కర్ణాటకలో బీజేపీ పార్టీ తరపున స్టార్ కాంపైనర్ గా మారి ప్రచారం చేస్తున్న వీడియో విజువల్స్ వైరల్ గా మారాయి. తాను ప్రచారం చేస్తున్న వ్యక్తి చాలా మంచి వాడని అందుకే హైదరాబాద్ నుంచి వచ్చి మరీ ప్రచారం చేస్తున్నాను అని అందుకే అందరూ అర్ధం చేసుకోవాలని కోరారు.

అంతే కాకుండా తన మార్క్ కామెడీ టైమింగ్ తో కూడా బ్రహ్మీ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దీనితో బ్రహ్మానందం నుంచి ఈ ఊహించని చర్య ఒక్కసారిగా చర్చగా మారి వైరల్ గా మారింది. ఇక ఈ బ్రహ్మానందం అయితే “కీడా కోలా” లో ప్రస్తుతం కీలక పాత్ర చేస్తుండగా రీసెంట్ గా “రంగమార్తాండ” చిత్రంలో ఎమోషనల్ పాత్రలో  కనిపించి మెప్పించారు. మరికొన్నాళ్లు కితం అయితే ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.