ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర కాంట్రవర్సీ తో బాగా వినిపిస్తున్న చిత్రం “ఆదిపురుష్” పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని అయితే దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించగా ఈ సినిమాతోనే ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. మరి ఈ చిత్రం రిలీజ్ అయ్యాక యూనానిమస్ గా అయితే సూపర్ పాజిటివ్ టాక్ ఏమీ తెచ్చుకోలేదు.
కానీ వసూళ్లు బాగానే రాబట్టినప్పటికీ స్వయంగా చిత్ర మేకర్స్ నుంచే పలు షాకింగ్ స్టేట్మెంట్ లు వస్తుండడం మరింత కాంట్రవర్సియల్ గా ఈ చిత్రానికి మారింది. ఇక ఈ చిత్రానికి రచయితగా చేసిన ముంతషీర్ శుక్ల మరో కాంట్రవర్సియల్ స్టేట్మెంట్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.
కొన్ని రోజులు కితమే తాము అసలు రామాయణమే తీయలేదు రామాయణం నుంచి ప్రేరణ చెంది ఈ సినిమా చేశామని చెప్పగా ఇపుడు అయితే హనుమంతుడు అసలు దేవుడే కాదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే హనుమాన్ భగవాన్ ఎందుకు కాదు అంటే తాను నిజమైన దేవుడు రామునికి మహా భక్తుడు అని.
కానీ మనం మనుషులు ఆంజనేయుని దేవునిగా మార్చాం తప్పితే హనుమంతుడు దేవుడు కాదు అని నేషనల్ మీడియాలో లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో చెప్పడం వైరల్ గా మారింది. మరి సినిమా రిజల్ట్ ఏమో కానీ ఇతడు ఇస్తున్న స్టేట్మెంట్స్ తో మాత్రం కొత్త తలనొప్పులు మొదలయ్యేలా ఉన్నాయని మాత్రం అనిపిస్తుంది.