షాకింగ్ : “ఆదిపురుష్” ఓటిటి రిలీజ్ కోసమే ఈ లీక్..?

ఈ ఎన్నో అంచనాలు పెట్టుకొని వచ్చి భారీ డిజాస్టర్ అయిన చిత్రం “ఆదిపురుష్”. ఓపెనింగ్స్ అయితే మాసివ్ లెవెల్లో వచ్చాయి కానీ సినిమా మాత్రం ఫైనల్ గా డిజాస్టర్ అయ్యింది. రిలీజ్ కి ముందు ఉన్న హైప్ తో ఈ సినిమా డెఫినెట్ గా 1000 కోట్ల మార్క్ ని టచ్ చేస్తుంది అని చాలా మంది భావించారు.

కానీ అనూహ్యంగా ఈ చిత్రం అందులో సగం కూడా ఇప్పుడు అందుకోలేదు. దీనితో ఈ చిత్రం మరో భారీ నష్టాలు మిగిల్చే సినిమాగా నిలిచిపోగా ఈ సినిమా రిలీజ్ కి ముందే మేకర్స్ ఓటిటి రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రం థియేటర్స్ లో వచ్చిన 8 వారాలు తర్వాతే ఓటిటి లో వస్తుంది అని తెలిపారు.

అయ్యితే ఇప్పుడు షాకింగ్ గా ఈ చిత్రం హెచ్ డి వెర్షన్ లీక్ అయ్యిపోయింది. తమిళ భాషలో అయితే ఫుల్ క్లారిటీ ప్రింట్ ఇప్పుడు నెట్ లోకి వచ్చేసింది. దీనితో ఇది వాంటెడ్ గా చేసిన లీక్ ఏమో కానీ దీనితో అయితే ఆదిపురుష్ ఓటిటి ఎర్లీ రిలీజ్ ఉంటుంది అని విశ్లేషకులు అంటున్నారు.

ఈ ట్రిక్ తో అయితే ఆగష్టు లో రావాల్సిన సినిమా జూలై లోనే ఓటిటి లో వచ్చేయొచ్చు అని తెలుస్తుంది. దీనితో ఆదిపురుష్ ఇపుడు హాట్ టాపిక్ గా నిలిచింది. మొత్తానికి అయితే బాలీవుడ్ దర్శకుడు ప్రభాస్ తో ట్రై చేసిన ఈ మోషన్ క్యాప్చర్ చిత్రం తక్కువ ఎమోషన్స్ ఎక్కువ ల్యాగ్ మూలాన మిస్ ఫైర్ అయ్యింది. ఇంకా ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటించగా సైఫ్ అలీ ఖాన్, ,సోనాల్ చౌహన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.