ఎవిక్షన్‌ ఫ్రీ పాస్ అందుకున్న శివ.. బిగ్ బాస్ ట్విస్ట్ కి షాక్ లో యాంకర్ శివ!

బిగ్ బాస్ చూస్తుండగానే చివరి వారాలకు చేరుకుంది ఇప్పటికే తొమ్మిది వారాలు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం మరొక రోజుతో 10వ వారం కూడా పూర్తి అవుతుంది. ఈ క్రమంలోనే ఈ వారం బిగ్ బాస్ హౌస్ లోకి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ లు ఎంట్రీ ఇచ్చిఎవిక్షన్ పాస్ కోసం గేమ్స్ ఆడిస్తున్నారు. ఇప్పటికే మానస్, సిరి, రవి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి కంటెస్టెంట్ లో సందడి చేశారు. ఈ క్రమంలోనే బాబా భాస్కర్ మాస్టర్, అనిల్ గోల్డెన్ టికెట్ పొందారు.

ఇక యాంకర్ రవి హౌస్ లోకి ఎంట్రీ చెక్ కంటెస్టెంట్ ల మధ్య ఎవిక్షన్ పాస్ కోసం గేమ్ నిర్వహించారు.ఈ గేమ్ లో శివ ఎంతో కష్టపడి ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ పోటీదారుడిగా యాంకర్ శివను ప్రకటించారు. అయితే అతని ఆనందం కొంత వరకు కూడా లేదనే చెప్పాలి. బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ కు యాంకర్ శివ షాక్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే శివ అందుకున్న బాక్స్ లో తన కోసం వచ్చిన ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ ఇతర కంటెస్టెంట్ లకు ప్రకటించాల్సి ఉందని బిగ్ బాస్ సూచించగా శివ తనకొచ్చిన ఫ్రీ పాస్ ను బిందుమాధవికి ఇచ్చారు.

ఈ క్రమంలోనే శివ మాట్లాడుతూ మూడు రోజుల నుంచి బిందుమాధవి జీరో పాయింట్ దగ్గర ఉన్నావు. ఏవిక్షన్ ఫ్రీ పాస్ అందుకొని గేమ్ బాగా ఆడు అని బిందుమాధవి కి చెప్పడంతో వెంటనే బిందుమాధవి అంటే సరిగా గేమ్ ఆడలేదని నాకు ఇస్తున్నావా అలా అయితే నాకొద్దు అంటూ తిరస్కరిస్తుంది. ఈ క్రమంలోనే మిగతా కంటెస్టెంట్ లు తనకి నచ్చిన చెబుతూ చివరికి బిందు కంటెండర్‌గా నిలిచేందుకు అంగీకరించింది. మొత్తానికి
ఎవిక్షన్ ఫ్రీ పాస్ పోటీ దారులలో బాబా భాస్కర్, అనీల్, బిందు నిలిచారు. మరో ఇద్దరు కూడా ఈ పోటీలోకి రానున్నారు మరి ఆ ఇద్దరు పోటీదారులు ఎవరో తెలియాల్సి ఉంది.