నటుడు ప్రభాకర్ నిజ స్వరూపమిదే.. నటి వీడియో వైరల్!!

Shiva parvati About Corona And Prabhakar

వెండితెర అయినా బుల్లితెర అయినా సరే నటీనటులను గొప్పవారిగా, ఆరాధ్య దైవాలుగా చూస్తుంటారు ప్రేక్షకులు అభిమానులు. అయితే వారు తెరపై పోషించే పాత్రలకు చేసే పనులకు తేడా ఉంటుందని గమనించరు. తాజాగా వదినమ్మ సీరియల్‌లో నటిస్తున్న శివ పార్వతీకి కరోనా సోకిందట. ఈ విషయం తెలిసినా కూడా ప్రభాకర్ గానీ చిత్ర యూనిట్ గానీ ఏమాత్రం స్పందించలేదట. ఈ మేరకు శివ పార్వతీ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Shiva parvati About Corona And Prabhakar

పైగా ఈ వైరస్ నోట్లో నుంచి వెళ్లి కింద నుంచి వచ్చేస్తుందని చెప్పాడట ప్రభాకర్. సినిమాలు మానేసినా గానీ అక్కడి వారికి దూరంగా ఉన్నాగానీ జీవితా రాజశేఖర్ వచ్చి సాయం చేశారట. ఏ హాస్పటల్‌లో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నానని కూడా అడగలేదని చాలా దురదృష్టమని శివ పార్వతీ వాపోయింది. ఈ విషయంలో ఎవర్నీ ఏం అనదల్చుకోలేదని, కేవలం థాంక్స్ మాత్రమే చెప్తున్నానని తెలిపింది. ఎందుకంటే ఈ కరోనా వచ్చింది కాబట్టి చాలామంది నిజ స్వరూపాలు తెలుసుకోగలిగానని పేర్కొంది.

శివ పార్వతీ ఎంతో వేదన చెందినట్టుగా కనిపిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. ఎంతో సీనియర్ నటి అయినా శివ పార్వతీకి ఇలాంటి దుస్థితి రావడం ఏంటని? ఎవ్వరూ పట్టించుకోరా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా శివ పార్వతీ వీడియో వదినమ్మ యూనిట్‌లో పెద్ద చిచ్చును పెట్టినట్టైంది.