Shilpa Chaudhary: గత కొద్దిరోజుల నుంచి శిల్పా చౌదరి పేరు పెద్ద ఎత్తున వినపడుతోంది. అందుకు గల కారణం ఈమె చేసిన మోసాలే.ఈమె ఎన్నో మాయమాటలు చెప్పి ఎంతో మంది వ్యాపారవేత్తలను సినీ ప్రముఖులను తన మాటలతో మాయ చేసి కోట్లకొద్దీ వారితో డబ్బులు తీసుకుంది. ఇలా ఎంతో మంది కోట్లలో ఈమెకు డబ్బులు ఇచ్చి మోసపోయారు. ఈ క్రమంలోనే ఇప్పటికే శిల్పా చౌదరి బాధితులుగా ఎంతోమంది బడా వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో కూడా ఈమె మాయలో పడినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే సెహరి సినిమాలో హీరోగా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో హర్ష్ కనుమల్లి సైతం శిల్ప చౌదరి మాటలు నమ్మి ఏకంగా ఆమె చేతిలో మూడు కోట్ల రూపాయలను పెట్టారు. ఈ క్రమంలోనే ఈ యంగ్ హీరో కూడా ఆ మూడు కోట్లను నష్టపోయినట్లు వెల్లడించారు. ఇకపోతే ఇలా రోజురోజుకు శిల్ప చౌదరి బాధితులు బయటపడటంతో ఈమెపై పలువురు సెలబ్రిటీలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శిల్ప చౌదరి తన భర్తను నార్సింగ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పోలీసుల కస్టడీలో ఉన్న ఈ దంపతులకు కోర్ట్ కేవలం శిల్ప చౌదరి భర్త శ్రీనివాస్ కు మాత్రమే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఇక శిల్పా చౌదరి బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేయడమే కాకుండా తనకు రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉంచాలని కోర్టు తీర్పు వెల్లడించింది. దీంతో ఈమెనూ పోలీసులు విచారణ చేపట్టనున్నారు. ఇక ఈ విచారణలో భాగంగా శిల్ప చౌదరి ఏ విధమైనటువంటి విషయాలను వెల్లడిస్తారనే విషయాల గురించి ఆసక్తి నెలకొంది. ఇలా చాలా మందిని మోసం చేస్తూ కోట్లలో డబ్బు పోగు చేసుకున్న ఈమె పోలీసుల ఎదుట ఏ విధమైనటువంటి సమాధానాలు చెబుతుందో వేచి చూడాలి.