Shekhar Master: ఈ మధ్య ఏదైనా పండగ వస్తుందంటే చాలు ప్రత్యేక ఈవెంట్స్ చేసి, తమ టీఆర్పిని పెంచుకునేందుకు టీవీ ఛానెల్స్ తెగ పోటీ పడుతున్నాయి. అందులో భాగంగా ఇటీవల స్టార్ మా కూడా హోలీ పండుగ సందర్భంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. పలువురు కమెడియన్స్ తో, మరికొంతమంది సెలబ్రిటీస్ తో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే కాకుండా అందరినీ ఎంటర్ టైన్ చేసేందుకు పలు స్కిట్స్, డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.
తగ్గేదేలే అనే పేరుతో నిర్విహించిన ఈ షోలో మొత్తంగా చూస్కుంటే రెండు డాన్స్ పెర్ఫార్మెన్స్ వీక్షకులను బాగా ఆకట్టుకున్నట్టు తెలుస్తోంది. అందులో ఒకటి యాంకర్ రవి తన కూతురితో చేసిన డాన్స్ ఒకటి కాగా, మరొకటి శేఖర్ మాస్టర్ తన కూతురు సాహితీతో చేసిన డాన్స్ మరొకటి. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలోని చంద్రుళ్ళో ఉండే కుందేలు సాంగ్ కు వీరిద్దరూ కలిసి చేసిన డాన్స్ పై పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు. మరి కొందరేమో అలాంటి పాటలు కూతురితో చేయడం ఏంటీ అని పెదవి విరుస్తున్నారు.
ఐతే తాజా పరిణామాలను గనక పరిశీలిస్తే, ఒక సీనియర్ జర్నలిస్ట్ తన ఫేస్బుక్ ఖాతాలో ఇటీవల శేఖర్ మాష్టర్ తన కూతురితో కలిసి చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ ను విమర్శిస్తూ పోస్ట్ చేయడం ప్రస్తుతం వైరల్ గా మారింది. తండ్రీ, కూతుళ్ళ డాన్స్ ఏంటో అంటూ ఆయన చేసిన పోస్ట్ పై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. అందులో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు ఎంపిక చేసుకున్న పాట్ కూడా అంత గ్లామర్ పాట కూడా కాదు అందులో మీకేం తప్పుగా కనిపించింది అంటూ తీవ్ర స్థాయిలో స్పందిస్తూ శేఖర్ మాస్టర్ కు సపోర్ట్ చేస్తున్నారు.