Sharwanand : సినిమాలు ఆడకపోయినా ఆ హీరో అంత పారితోషకం డిమాండ్ చేస్తున్నాడా!

Sharwanand : సినిమా ఇండస్ట్రీలో హీరోలదే హవా ప్రస్తుతం. రెమ్యూనరేషన్ విషయం లో వారికే పెద్దపీట. మిగతా వారికి అంత ప్రాముఖ్యం ఉండదు. వారి మార్కెట్ బట్టి డిమాండ్ ఉంటుంది.అయితే ఇదంతా పెద్ద హీరోల విషయంలో. చిన్న సినిమాల విషయంలో చిన్న హీరోలకు ఎక్కువ మొత్తంలో పారితోషకం ఇవ్వరు.ఇది మాములుగా పరిశ్రమలో జరిగే విషయమే. అయితే ఈ హీరో మాత్రం అందుకు భిన్నంగా రెమ్యూనరేషన్ తన మార్కెట్ కి మించి డిమాండ్ చేస్తున్నాడట ఇంతకీ ఎవరా ఈ హీరో అంటే ఇంకెవరు మన శర్వానంద్.

శర్వానంద్ వరుస పరాజయాలను చూస్తున్న ఎక్కువగా పారితోషకం డిమాండ్ చేస్తున్నాడు. వరుసగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 సినిమాలు ప్లాప్ లిస్ట్ లో ఉన్నాయి.పడి పడి లేచే మనసు, రణరంగం, జాను, శ్రీకారం,మహాసముద్రం, మరియు ఇటీవలే విడుదలైన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలు పరాజయం చవిచుసాయి.అయినా కుడా శర్వా ఏ మాత్రం రెమ్యూనరేషన్ల విషయంలో తగ్గేదేలే అంటున్నాడు.

ఏకంగా కొత్త ప్రాజెక్టు కోసం 10 కోట్లు డిమాండ్ చేసాడట.కృష్ణ చైతన్య దర్శకత్వం లో ఒక సినిమా కు సైన్ చేసాడు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమా ను నిర్మిస్తోంది. చిత్ర నిర్మాత 10కోట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారట దీంతో వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట శర్వా.ఇక రాజు సుందరం డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నడట అయితే ఇంకా అధికారిక ప్రకటన విలువడలేదు.

అయితే పెద్ద డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు శర్వాతో సినిమా చేయడానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదట. తన సినిమా 10కోట్లు కూడా కలెక్ట్ చేయకపోయినా శర్వా మాత్రం 10కోట్ల పారితోషకం డిమాండ్ చేయడం పెద్ద అడ్డంకిగా మారింది అని ఫిల్మ్ వర్గాల టాక్.అయితే తన మార్కెట్ కు తగ్గట్టు పారితోషకం తీసుకునే విషయంలో శర్వా ఎపుడు మేల్కొంటాడో.