Sharwanand : అచ్చం ఆ హీరోలాగానే శర్వానంద్ చేస్తున్నాడా!!

Sharwanand : శర్వానంద్, నానీ ఇద్దరు కష్టపడి సొంత గుర్తింపు తెచ్చుకున్న హీరోలే. ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకున్నా ఒక్కోమెట్టు ఎక్కి వచ్చారు. నాని అష్ట చెమ్మ సినిమాతో హిట్ కొట్టి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక శర్వానంద్ కూడా ప్రస్థానం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక నాని చేసిన ఈగ అలా మొదలయింది, భలే భలే మగాడివోయ్, జర్సీ, కృష్ణ గాడి వీర ప్రేమగాధ వంటి సినిమాలతో హిట్ కొట్టి తన స్థానాన్ని పదిలపరుచుకున్నాడు.

ఇక శర్వానంద్ కూడా ప్రస్థానం,రన్ రాజా రన్, శతమానం భవతి వంటి సినిమాలతో మంచి హిట్లు సాధించాడు.కానీ లాగానే మంచి హిట్లు కొట్టిన చాలా ప్లాప్ సినిమాలను మూటగట్టుకున్నాడు. నాని వీ, టక్ జగదీశ్,గ్యాంగ్ లీడర్ వంటి వరుసగా ప్లాప్ లు చూసాక ఇప్పుడు కొంచెం హిట్ దారిలోకి వచ్చి శ్యామ్ సింగ్ రాయ్ తో మంచి టాక్ తెచ్చుకున్నాడు. నాని సినిమాలు క్లాస్ ఆడియన్స్ ను, విదేశాల్లోని ప్రేక్షకులకు నచ్చుతాయి అందుకే సరిగా ప్లాన్ చేసుకుంటే తన మార్కెట్ ను ఇంకాస్త పెంచుకోవచ్చు.

అలాగే శర్వా కూడా మంచి కథలను ఎంచుకున్నా వరుస ప్లాప్ లతో అల్లాడుతున్నాడు. నాని వాటి నుండి బయటపడింది హిట్ కొట్టినట్టు ఇంకా శర్వా కొట్టలేదు ఇటీవలే వచ్చిన ఆడవాళ్లు మీకు జోహార్లు కూడా నిరాశపరిచింది ఇలా వరుస పరాజయలతో నాని కెరీర్ ను ఫాలో అవుతున్న శర్వా నాని ల తెలుసుకుంటే బాగుండేది. ఆల్రెడీ జరగల్సిన నష్టం జరిగిపోయినా వచ్చే సినిమాలనైనా చక్కగా ప్లాన్ చేసుకుంటే మంచిది త్వరలోనే నాని ల మళ్ళీ విజయాలను సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇక శర్వా ఆశలన్నీ ఒకే ఒక జీవితం సినిమాపై ఉన్నాయి ఇందులో అమల ముఖ్య పాత్రలో నటిస్తుండటం, టైం ట్రావెల్ కి సంబందించిన సినిమా కావడంతో ఆసక్తి నెలకొంది.ఇన్ని వరుస పరాజయలతో ఉన్న శర్వా మాత్రం రెమ్యూనరేషన్ విషయంలో అసలు తగ్గడం లేదు. దాదాపు 10కోట్లు ఒక సినిమా కు తీసుకుంటున్నాడు. ఇటీవలే కృష్ణ చైతన్య డైరెక్షన్ లో ఒక సినిమాకు సైన్ చేసాడు. తన తదుపరి చిత్రాలతో అయినా శర్వానంద్ విజయం సాధించాలని ఆశిద్దాం.