లేటెస్ట్ : “ఇండియన్ 2” నుంచి బిగ్ అప్డేట్ కి టైం లాక్ చేసిన శంకర్..!

ఇండియన్ సినిమా దగ్గర అయితే టాలీవుడ్ సినిమా ఓ రేంజ్ లో షైన్ అయ్యిన తర్వాత కోలీవుడ్ సినిమా బాగా వెనక్కి వెళ్తున్న అన్న సమయంలో రజినీకాంత్ విజయ్ లాంటి స్టార్ ల సినిమాలు వచ్చి భారీ వసూళ్లు కొల్లగొట్టాయి. అయితే అక్కడ ప్రాపర్ గా సరైన దర్శకుని నుంచి సినిమాలు తక్కువే వచ్చాయి.

అలాంటి వాటిలో సెన్సేషనల్ దర్శకుడు శంకర్ కూడా ఒకరు. ఎప్పుడో 2.0 తర్వాత నుంచి మరో సినిమా తన నుంచి లేదు. కాగా ఈ చిత్రం అనంతరం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా స్టార్ట్ చేసి రెండేళ్లు అయినా అది ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అయితే దీని కన్నా ముందు ఉలగనయగన్ కమల్ హాసన్ తో “ఇండియన్ 2” అనే సెన్సేషన్ సీక్వెల్ ని స్టార్ట్ చేసి ఆపేసిన సంగతి తెలిసిందే.

ఈ సీక్వెల్ పై ఇండియా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా పూర్తవుతుంది. ఇక ఈ భారీ చిత్రం నుంచి అయితే దర్శకుడు శంకర్ ఇపుడు ఓ సర్ప్రైజ్ అప్డేట్ అందించారు. రేపు ఉదయం అక్టోబర్ 29 న 11 గంటలకి ఓ బిగ్ అప్డేట్ ని అయితే రివీల్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

అలాగే దీనితో అయితే మళ్ళీ సేనాపతి తిరిగి వస్తున్నాడు అన్నట్టుగా ఓ పోస్ట్ కవర్ లాంటిది కనిపిస్తోంది. దీనితో తమిళ ఫ్యాన్స్ అండ్ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న వారు ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ తదితరులు నటిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.